Best Web Hosting Provider In India 2024
ZNMD Sequel: బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోందా? హింట్ ఇచ్చిన త్రీ మస్కటీర్స్
ZNMD Sequel: బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ జిందగీ న మిలేగీ దొబారా సీక్వెల్ రాబోతోందా? ఈ మూవీలో నటించిన త్రీ మస్కటీర్స్, బాలీవుడ్ స్టార్ హీరోలు ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా డైరెక్టర్ కు హింట్ ఇవ్వడం విశేషం.
ZNMD Sequel: బాలీవుడ్లో ఫ్రెండ్షిప్ పై వచ్చిన ఐకానిక్ మూవీస్ లో జిందగీ న మిలేగీ దొబారా కూడా ఒకటి. ఎప్పుడో 2011లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ రానున్నట్లు ఇందులో నటించిన స్టార్ హీరోలు హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్ హింట్ ఇచ్చారు.
జిందగీ న మిలేగీ దొబారా సీక్వెల్
14 ఏళ్ల కిందట వచ్చిన జిందగీ న మిలేగీ దొబారా మూవీని ఫర్హాన్ అక్తర్ చెల్లెలు, డైరెక్టర్ జోయా అక్తర్ డైరెక్ట్ చేసింది. ఇప్పుడామెకు సీక్వెల్ పై హింట్ ఇస్తూ ఈ సినిమాలో త్రీ మస్కటీర్స్ గా నటించిన హృతిక్, అభయ్, ఫర్హాన్ బుధవారం (జనవరి 22) ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ ముగ్గురూ ఓ రెస్టారెంట్లో కూర్చోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
త్రీ మస్కటీర్స్ అనే క్లాసిక్ అడ్వెంచర్ నవలను చూస్తూ వీళ్లు అన్బిలీవబుల్, ఔట్స్టాండింగ్ అంటుంటారు. ఈ వీడియోను ఫర్హాన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ.. “జోయా అక్తర్.. నీకేమైనా సైన్స్ కనిపిస్తున్నాయా” అనే క్యాప్షన్ ఉంచాడు. దీనికి జోయా అక్తర్ కూడా రిప్లై ఇచ్చింది. “అవును.. యూనివర్స్ నాతో మాట్లాడుతోంది” అంటూ లాఫింగ్ ఎమోజీలను పోస్ట్ చేసింది.
ఈ పోస్టుపై అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అధికారిక అకౌంట్లు కూడా స్పందించడం విశేషం. మన ముగ్గురు కుర్రాళ్లు అంటూ ప్రైమ్ వీడియో కామెంట్ చేయగా.. క్యా తుమ్ సైన్స్ దేఖ్ రహే హో మై బ్యోయ్ అంటూ ఆ మూవీలోని ఓ ఫేమస్ డైలాగ్ నే కామెంట్ చేసింది నెట్ఫ్లిక్స్. ఈ వీడియోకు జిందగీ న మిలేగీ దొబారా మూవీలోని సెనోరిటా పాటను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేశాడు.
జిందగీ న మిలేగీ దొబారా మూవీ గురించి..
జిందగీ న మిలేగీ దొబారా మూవీ జులై 15, 2011న రిలీజైంది. ఈ కామెడీ డ్రామాను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించింది. జోయా అక్తర్ డైరెక్ట్ చేసింది. హృతిక్ రోషన్ తోపాటు ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్, కల్కి కొచ్లిన్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు అర్జున్, కబీర్, ఇమ్రాన్ చుట్టూ తిరుగుతుంది.
స్పెయిన్ లో ఈ ముగ్గురూ ఓ ట్రిప్ కు వెళ్తారు. ఆ ట్రిప్ అడ్వెంచరస్ గా సాగాలని ముందుగానే అనుకుంటారు. దీనికోసం ఒకరు విసిరిన సవాలుకు మిగిలిన ఇద్దరు అంగీకరించాలి. జీవితంలోని భయాలు, సవాళ్లను ఈ సాహసాల ద్వారా అధిగమించాలన్నదే వాళ్ల లక్ష్యం. ఈ ముగ్గురు స్నేహితుల్లో తమను తాము చూసుకున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ గా నిలిచింది.