Balakrishna: ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది- నా కలెక్షన్స్, రికార్డులన్నీ ఒరిజినల్: బాలకృష్ణ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Balakrishna: ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది- నా కలెక్షన్స్, రికార్డులన్నీ ఒరిజినల్: బాలకృష్ణ కామెంట్స్

 

Balakrishna Comments At Daaku Maharaaj Success Celebrations: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను జనవరి 22న అనంతపురములో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 
ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది- నా కలెక్షన్స్, రికార్డులన్నీ ఒరిజినల్: బాలకృష్ణ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది- నా కలెక్షన్స్, రికార్డులన్నీ ఒరిజినల్: బాలకృష్ణ కామెంట్స్
 

Balakrishna Daaku Maharaaj Success Celebrations: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో అదరగొడుతోంది.

గ్రాండ్‌గా డాకు మహారాజ్ విజయోత్సవ వేడుక

ఈ నేపథ్యంలో బుధవారం (జనవరి 22) అనంతపురములో అభిమానుల మధ్య చాలా గ్రాండ్‌గా డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్‌లో బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఒక రాష్ట్రపతిని ఇచ్చింది

డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అభివక్త ఆంధ్రప్రదేశ్‌కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ. తెలుగుజాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడిని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఇది రాయలసీమ కాదు రాయల్ సీమ” అని అన్నారు.

కొత్తగా చూపించాలనే

“డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి సినిమాకి ఏదో కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేస్తుంటాము. డాకు మహారాజ్ కోసం కూడా ఎంతో రీసెర్చ్ చేశాము” అని బాలకృష్ణ అన్నారు.

ఆ పాత్ర నుంచి పుట్టిందే

“ఆదిత్య 369లో నేను పోషించిన కృష్ణదేవరాయ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి గుర్తుండిపోయే పాత్రలు చేయాలనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ పాత్ర పుట్టింది. కొవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను” అని బాలకృష్ణ తెలిపారు.

 

అభిమానుల రూపంలో

“ఈ సినిమాలు అభిమానులకు నచ్చడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సంతోషంగా ఉండేలా చేశాయి. నా తండ్రి, గురువు, దైవం నందమూరి తారక రామారావు గారు నాకు అభిమానుల రూపంలో ఇంతటి కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మజన్మల పుణ్యఫలం” అని బాలకృష్ణ పేర్కొన్నారు.

అన్నీ ఒరిజినల్స్ అని తెలుసు

“నేను సినిమా కలెక్షన్స్ గురించి పట్టించుకోను. నా అభిమానులే నా ప్రచార కర్తలు. వాళ్లకు తెలుసు.. నా రికార్డులన్నీ ఒరిజినల్ అని, నా కలెక్షన్స్ అన్నీ ఒరిజినల్ అని, నా అవార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని, నా రివార్డ్స్ అన్నీ ఒరిజినల్ అని. దర్శకుడు బాబీ ఎంతో ప్రతిభావంతుడు. నటీనటుల నుంచి హావభావాలు చక్కగా రాబట్టుకోగలిగాడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీతం హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్టే. ఎంతో బాధ్యతగా అద్భుతమైన సంగీతం అందించాడు” అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

దబిడి దిబిడి సాంగ్ అదరగొట్టారు

“మా కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారి విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. యుగంధర్ గారి వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. రచయితలు మోహన్ కృష్ణ గారు, చక్రి, నందు, భాను కలిసి సన్నివేశాలు, సంభాషణలు గొప్పగా రాశారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ దబిడి దబిడి సాంగ్ అదరగొట్టారు” అని బాలకృష్ణ తెలిపారు.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024