Best Web Hosting Provider In India 2024
OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి నయనతార, మాధవన్ కోలీవుడ్ థ్రిల్లర్ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
OTT: నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ మూవీ టెస్ట్ నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ నెలాఖరున లేదా మే ఫస్ట్ వీక్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
OTT: నయనతార, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన కోలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ మూవీ టెస్ట్ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ఎస్ శశికాంత్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో నయనతార, మాధవన్‌తో పాటు సిద్ధార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు.
2024లో షూటింగ్ కంప్లీట్…
టెస్ట్ మూవీ షూటింగ్ పూర్తయి ఏడాది దాటిపోయింది. 2024 జనవరిలో టెస్ట్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అనౌన్స్ చేసి ఏడాది ఏడాది దాటినా సినిమా మాత్రం ఇప్పటి వరకు థియేటర్లలోకి రాలేదు.
తాజాగా టెస్ట్ మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్…
టెస్ట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ నెలాఖరున లేదా మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు చెబుతోన్నారు.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు శశికాంత్ టెస్ట్ మూవీని తెరకెక్కించాడు. చెన్నైలోని క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంటుంది. ఆ మ్యాచ్ కారణంగా ఓ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? టెస్ట్ మ్యాచ్ చూడటానికి వచ్చిన వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ మూవీ కథ. టెస్ట్ మూవీకి సుమన్ కుమార్ కథను అందించారు. గతంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన రఘు తాత మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు.
ఏడు సినిమాలు…
ప్రస్తుతం నయనతార తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఏడు సినిమాల్లో నటిస్తోంది. యశ్ హీరోగా నటిస్తోన్న కన్నడ మూవీ టాక్సిక్‌లో నయనతార ఓ హీరోయిన్‌గా కనిపించబోతున్నది. మరోవైపు మాధవన్ కొన్నాళ్లుగా ఓటీటీ పై ఎక్కువగా ఫోకస్ పెడుతోన్నాడు.