Best Web Hosting Provider In India 2024
YS Sharmila On CBN : ‘అదానీపై చర్యలకు భయపడుతున్నారా..?’ సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సూటి ప్రశ్నలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.ప్రతిపక్షంలో ఉండగా అదానీ శత్రువుగా ఉన్నారని.. ఇప్పుడేమో అదే అదానీ మిత్రుడుగా మారిపోయారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ACBని రంగంలోకి దించాలని… నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చాలన్నారు. గౌతమ్ అదానీపై చర్యలకు కచ్చితమైన సమాచారం కావాలని చంద్రబాబు మాట్లాడటం అతిపెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. గతంలో తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు..? ప్రశ్నించారు.
నాడు కోర్టుకు ఎందుకెళ్లారు..?
“గౌతమ్ అదానీపై చర్యలకు చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు ? అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టీ కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారు ? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు?” అని వైఎస్ షర్మిల నిలదీశారు.
“ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పారు. అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారు. ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు గారు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లే” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
భయపడుతున్నారనేది నిజం – వైఎస్ షర్మిల
అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచారని షర్మిల దుయ్యబట్టారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ACBని సైతం రంగంలోకి దించకపోవడమేంటని ప్రశ్నించారు. అదానీని కాపాడుతున్నారు అనే దానికి ఇదే నిదర్శనమన్నారు.
“అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజం. మోడీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయండి. అదానీ వ్యవహారంపై ఏసీబీని రంగంలోకి దించండి. నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండి” అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్