Best Web Hosting Provider In India 2024
Oscars 2025 Nominations: ఆస్కార్స్ 2025 నామినేషన్లు వచ్చేశాయ్.. ఇండియన్ ఫిల్మ్ అనూజకు చోటు
Oscars 2025 Nominations: ఆస్కార్స్ 2025 కోసం నామినేషన్లను అకాడెమీ గురువారం (జనవరి 23) అనౌన్స్ చేసింది. గునీత్ మోంగా, ప్రియాంకా చోప్రా నిర్మించిన ఫిల్మ్ అనూజకు ఇందులో చోటు దక్కడం విశేషం.
Oscars 2025 Nominations: ఆస్కార్స్ 2025లో ఇండియాకు కూడా ప్రాతినిధ్యం దక్కింది. అనూజ అనే మూవీకి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కింది. ఇందులో మొత్తం 180 సినిమాలు అర్హత సాధించగా.. కేవలం ఐదే నామినేట్ అయ్యాయి. అందులో ఈ అనూజ కూడా ఒకటి. ఈ షార్ట్ ఫిల్మ్ ను గునీత్ మోంగా, ప్రియాంకా చోప్రా నిర్మించడం విశేషం.
ఆస్కార్స్ నామినీలలో అనూజ
97వ అకాడెమీ అవార్డుల కోసం నామినీలను గురువారం (జనవరి 23) అనౌన్స్ చేశారు. వీటిలో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజ చోటు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అనూజతోపాటు ఏలియన్, ఐ యామ్ నాట్ ఎ రోబో, ది లాస్ట్ రేంజర్, ఎ మ్యాన్ హు వుడ్ నాట్ రిమేన్ సైలెంట్ పోటీ పడనున్నాయి.
గునీత్ మోంగా నిర్మించిన మూడో సినిమా ఆస్కార్స్ లో పోటీ పడబోతోంది. గతంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్స్ గెలుచుకున్నాయి. మార్చి 2న లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 97వ ఆస్కార్స్ ప్రదానోత్సవం జరగనుండగా.. కొనన్ ఓబ్రైన్ హోస్ట్ చేస్తున్నాడు.
అనూజ మూవీ గురించి..
ఈ అనూజ అనే షార్ట్ ఫిల్మ్ 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఇద్దరూ ఓ బట్టల ఫ్యాక్టరీలో పని చేస్తుంటారు. బాల కార్మికుల జీవితాల్లోని ఓ తెలియని కోణాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించింది. ఈ మూవీని ఆడమ్ జే గ్రేవ్స్ డైరెక్ట్ చేశాడు. ఈ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ప్రియాంకా చోప్రాతోపాటు గునీత్ మోంగా కూడా ఈ షార్ట్ ఫిల్మ్ సహ నిర్మాతలుగా ఉన్నారు.
ఆస్కార్స్ నామినీలు ఇలా..
బెస్ట్ పిక్చర్ – అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్‌నోన్, కాన్‌క్లేవ్, డ్యూన్: పార్ట్ టు, ఎమిలియా పెరెజ్, ఐ యామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్
బెస్ట్ యాక్టర్ – అడ్రియన్ బ్రోడీ (ది బ్రూటలిస్ట్), టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్‌నోన్), కోల్మన్ డోమింగో (సింగ్ సింగ్), రాల్ఫ్ ఫియెన్నెస్ (కాన్‌క్లేవ్), సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)
బెస్ట్ యాక్ట్రెస్ – సింథియా ఎరివో (విక్డ్), కార్లా సోఫియా గాస్కన్ (ఎమీలియా పెరెజ్), మిక్కీ మాడిసన్ (అనోరా), డెమీ మూర్ (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోరెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)
బెస్ట్ డైరెక్టర్ – జాక్వెస్ ఆడియర్డ్ (ఎమీలియా పెరెజ్), సీన్ బాకర్ (అనోరా), బ్రాడీ కోర్బెట్ (ది బ్రూటలిస్ట్), కొరాలీ ఫర్గీట్ (ది సబ్‌స్టాన్స్), జేమ్స్ మాన్‌గోల్డ్ (ఎ కంప్లీట్ అన్‌నోన్)
సంబంధిత కథనం