Best Web Hosting Provider In India 2024
Bold Web Series: తెలుగు బోల్డ్ వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 – ముగ్గురు హీరోయిన్లతో – ఏ ఓటీటీలో చూడాలంటే?
Bold Web Series: తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ త్రీ రోజెస్‌కు సెకండ్ సీజన్ రాబోతుంది.. త్వరలోనే త్రీ రోజెస్ సీజన్ 2 రిలీజ్ కానున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ బోల్డ్ వెబ్‌సిరీస్‌లో ఈషారెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
Bold Web Series: పాయల్ రాజ్‌పుత్, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ సీజన్ 2 ఆహా ఓటీటీలో ద్వారా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సెకండ్ సీజన్‌కు సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను ఆహా ఓటీటీ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఈ పోస్టర్లో ముగ్గురు మోడ్రన్ అమ్మాయిలు, వారి చుట్టూ గులాబీ పూలు, మందు గ్లాసులు కనిపిస్తున్నాయి. కమింగ్ సూన్ విత్ రోజెస్…సర్ప్రైజెస్…ఫ్రాన్సు కర్రీ, రిలేషన్షిప్ స్టోరీలకు రెడీ యా అంటూ పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
ఫిబ్రవరిలోనే…
ఫిబ్రవరిలో త్రీ రోజెస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్‌కు మించి రొమాంటిక్, కామెడీ అంశాలతో త్రీ రోజెస్ సీజన్ 2 సాగనున్నట్లు చెబుతోన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మహిళా సాధికారతకు సంబంధించి మెసేజ్‌ను ఈ వెబ్‌సిరీస్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
కొత్త పాత్రలు కూడా…
సీజన్ వన్‌లో నటించిన సంగీత్ శోభన్, హర్ష చెముడు, ప్రిన్స్, సాయి రోనక్, సత్యం రాజేష్ సెకండ్ సీజన్లో కనిపిస్తారని సమాచారం. వీరితో పాటు మరికొన్ని కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని అంటున్నారు. త్రీ రోజెస్ వెబ్‌సిరీస్‌కు డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరించారు. మాగీ దర్శకత్వం వహించారు. బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించాడు.
ముగ్గురు స్నేహితుల కథ…
ఆడపిల్లల పెళ్లి విషయంలో కుటుంబసభ్యుల ఆలోచనలు ఎలా ఉంటాయనే పాయింట్‌కు రొమాన్స్, వినోదం జోడించి ఫస్ట్ సీజన్‌ను మేకర్స్ తెరకెక్కించారు. రీతూ (ఈషా రెబ్బా) యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంటుంది. రీతూకు పెళ్లి చేయాలని ఆమె తల్లి తొందరపడుతుంది. తల్లి తెచ్చే పెళ్లి సంబంధాల్ని రిజెక్ట్ చేస్తూ టైమ్‌పాస్ చేస్తుంటుంది రీతూ .
పెళ్లికి ముందే డేటింగ్లో ఉంటుంది జాహ్నవి (పాయల్ రాజ్‌పుత్). అందులో తప్పేం లేదని నమ్ముతుంటుంది. ఇందుకు(పూర్ణ) ముప్పై ఏళ్ల వయసు దాటుతుంది. అయినా పెళ్లి కాదు. తన కంటే వయసులో చిన్నవాడైన ఓ యువకుడు ఆమెను ప్రేమిస్తుంటాడు. పెళ్లి, రిలేషన్స్ విషయంలో రీతూ, ఇందు, జాహ్నవి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ ముగ్గురు స్నేహితురాళ్ల జీవితం ఏ విధమైన మలుపులు తిరిగింది అనే అంశాలతో త్రీ రోజెస్ సీజన్ వన్ తెరకెక్కింది.