Venkatesh: సౌందర్యను ఐశ్వర్య రాజేష్ గుర్తు చేస్తున్నారని అంటున్నారు.. హీరో వెంకటేష్ సమాధానం ఇదే!

Best Web Hosting Provider In India 2024

Venkatesh: సౌందర్యను ఐశ్వర్య రాజేష్ గుర్తు చేస్తున్నారని అంటున్నారు.. హీరో వెంకటేష్ సమాధానం ఇదే!

Sanjiv Kumar HT Telugu
Jan 24, 2025 06:37 AM IST

Venkatesh About Aishwarya Rajesh Compared To Soundarya: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా నటించిన ఐశ్వర్య రాజేష్‌ దివంగత హీరోయిన్ సౌందర్యను గుర్తు చేస్తున్నారన్న కాంప్లిమెంట్స్‌పై వెంకటేష్ ఆన్సర్ ఇచ్చాడు.

సౌందర్యను ఐశ్వర్య రాజేష్ గుర్తు చేస్తున్నారని అంటున్నారు.. హీరో వెంకటేష్ సమాధానం ఇదే!
సౌందర్యను ఐశ్వర్య రాజేష్ గుర్తు చేస్తున్నారని అంటున్నారు.. హీరో వెంకటేష్ సమాధానం ఇదే!

Venkatesh About Aishwarya Rajesh Compared To Soundarya: ఫ్యామిలీ హీరో, విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ కుటుంబా కథా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

yearly horoscope entry point

బాక్సాఫీస్ సంభవం

బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోన్న సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ బాక్సాఫీస్ సంభవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

వెంకటేష్ గారు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

-వండర్‌ఫుల్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతికి హానెస్ట్‌గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ, ఆడియన్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్ యూ.

వెంకటేష్ గారు.. అనిల్ గారు ఈ సినిమాకి ప్రమోషన్స్ ఐడియా చెప్పినప్పుడు ఎలా అనిపించింది?

-ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేది. ఈ సినిమా జర్నీ ఒక మ్యాజికల్‌గా అనిపించింది. అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఇదంతా డివైన్ ఎనర్జీగా భావిస్తున్నాను.

అనిల్ గారు ఈ సినిమా విజయంలో భీమ్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. నెక్ట్స్ ఆయనతో జర్నీ ఎలా ఉంటుంది?

-భీమ్స్‌లో నాకు నచ్చే క్యాలిటీ దర్శకుడి కావాల్సిన మ్యూజిక్ ఇవ్వడం. ఈ పొంగల్‌తో భీమ్స్ టైం మొదలైయింది. నెక్ట్స్ పదేళ్లు తనదే. తనతో నా జర్నీ ఉంటుంది.

వెంకటేష్ గారు.. ఈ జర్నీలో అనిల్ గారిలో ఎలాంటి మార్పులు గమనించారు ?

-నేను తొలిసారి కలిసినప్పుడు అనిల్ ఓ రైటర్. తనలో అప్పుడే ఒక స్పార్క్ కనిపించింది. మా మధ్య మంచి రేపో ఉంది. తనతో ఎప్పుడూ ఓ ఫ్రెండ్ లానే ఉంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం, అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా ఉంటుంది. తను చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

వెంకటేష్ గారు.. ఐశ్వర్య రాజేష్ మీ కాంబినేషన్‌లో సౌందర్య గారిని గుర్తు చేశారనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీకు ఎలా అనిపించిందా ?

ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం ఉన్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024