Best Web Hosting Provider In India 2024
సచివాలయం: విద్యారంగంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని, విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాశాఖపై ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తు కోసం బైజూస్ కంటెంట్ ఫ్రీగానే ఇచ్చారని చెప్పారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందించామని, అందులోనూ బైజూస్ కంటెంట్ పెట్టి ఇచ్చామన్నారు. దానికి కూడా బైజూస్‌కి ఒక రూపాయి చెల్లించలేదని స్పష్టం చేశారు. అతని వ్యాపారాలతో మాకు సంబంధం లేదని చెప్పారు. పిల్లలకు మంచి ఇంగ్లీష్ అందించడం కోసం టోఫెల్‌ను తీసుకొచ్చామన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు టోఫెల్‌కి ఇస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.