Best Web Hosting Provider In India 2024
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ రొమాంటిక్ ఫోజులు – సాగర్‌ను అపార్థం చేసుకున్న నర్మద తండ్రి
Illu Illalu Pillalu:ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 24 ఎపిసోడ్లో ప్రేమకు బహుమతిగా బంగారు హారాన్ని ఇస్తుంది వేదావతి. తాను వద్దని విసిరికొట్టిన హారం ప్రేమ మెడలో వేదావతి వేయడం చూసి భద్రావతి రగిలిపోతుంది. మరోవైపు నర్మదను సాగర్ ప్రేమగా చూడటం లేదని ఆమె తండ్రి ప్రసాద్ అపోహపడతాడు.
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ చేత గుడిలో వ్రతం చేయిస్తుంది వేదావతి. ఇష్టం లేకపోయినా వేదావతి మాట కాదనలేక ధీరజ్, ప్రేమ వ్రతాన్ని పూర్తిచేస్తారు. ప్రేమకు బహుమతిగా బంగారు హారాన్ని ఇస్తుంది వేదావతి. నీ పెళ్లి కోసం తయారు చేయించానని, కానీ ఆ దేవుడు నిన్ను నా ఇంటికే కోడలిగా పంపించాడని అంటుంది. తానే స్వయంగా ప్రేమ మెడలో హారాన్ని తొడుగుతుంది వేదావతి. భద్రావతి కోపంగా విసిరికొట్టిన హారాన్ని వేదావతి…ప్రేమకు అలకించడం చూసి శారదాంబ సంతోషపడుతుంది. భద్రావతి మాత్రం ఆ సీన్ చూపి కోపం పట్టలేకపోతుంది.
పాతికేళ్ల కల….
ధీరజ్, ప్రేమను జంటగా చూసి శారదాంబ మురిసిపోతుంది. ఇద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదని ఆనందపడుతుంది. భద్రావతి చూడకుండా వారిద్దరిని ఆశీర్వదిస్తుంది. ఇద్దరికి ఒకరి పట్ల మరొకరిని చచ్చేంత ప్రేమ ఉందని నాకు తెలుసునని శారదాంబ అంటుంది.
మీ ప్రేమ విషయం నాకు చెబితే నేను దగ్గరుండి మీ పెళ్లి చేసేదానినని చెబుతుంది. మన రెండు కుటుంబాలు కలవాలనే నా పాతికేళ్ల కల మీ రూపంలో నెరవేరుతుందని అనిపిస్తుందని ఎమోషనల్ అవుతుంది. మీరే మన కుటుంబాలను కలపాలని ధీరజ్, ప్రేమతో చెప్పి వెళ్లిపోతుంది శారదాంబ.
సాగర్ చిరాకు….
సాగర్‌తో కలిసి జాతరలో షాపింగ్ చేస్తుంటుంది నర్మద. భార్య ఏది అడిగినా సాగర్ మాత్రం పొడిపొడిగా సమాధానాలు ఇస్తుంటాడు. గాజులు తీసుకొని ఎలా ఉన్నాయని సాగర్‌ను అడుగుతుంది నర్మద. గాజులు ఏమైనా కొత్తగా తీసుకుంటున్నావా.. ఇన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటున్నావుగా, ఏవి బాగుంటాయో తెలియదా అని చిరాకుగా భార్యకు సమాధానమిస్తాడు సాగర్.
ఎందుకు అంత కోపం…భార్యకు ప్రేమగా గాజులు సెలెక్ట్ చేస్తే నీ సోమ్ము ఏమైనా కరిగి పోతుందా అని నర్మద అంటుంది. నాకు ఈ గాజులు నచ్చాయి కోనివ్వమని అంటుంది. అయినా సాగర్ వినకుండా నర్మదపై చిరాకును ప్రదర్శించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
లైఫ్ లాంగ్ హ్యాపీగా…
నర్మదపై సాగర్ కొప్పడటం ఆమె తల్లిదండ్రులు ప్రసాద్, సుజాత చూస్తారు. సాగర్‌ను అపార్థం చేసుకుంటారు. సాగర్ తనను కళ్లల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడని, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాననే సాగర్‌ను పెళ్లిచేసుకున్నానని నర్మద అంటుంది. సాగర్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఇప్పుడే కళ్లారా చూశానని ప్రసాద్ అంటాడు. సాగర్ మంచివాడని తండ్రికి చెప్పాలని చూస్తుంది నర్మద. కానీ తల్లిదండ్రులు ఆమె మాటల్ని వినరు. నీ మాయ మాటలతో మమ్మల్ని మభ్య పెట్టిందని చాలని, అబద్దాలు చెప్పింది చాలని, నీ మాటలు వింటుంటే అసహ్యాం కలుగుతుందని అంటారు.
పురుగులా చూస్తున్నాడు…
మా గుండెల మీద తన్నేసి సాగర్ కోసం వెళ్లిపోయావు..కానీ వాడు నిన్ను పురుగులా చూస్తున్నాడని, నువ్వు మమ్మల్ని మోసం చేసిన దానికి దేవుడు ఈ రూపంలో నీకు శిక్ష వేశాడని నర్మద తల్లి సుజాత అంటుంది.
సాగర్‌ను నమ్మి మోసపోయాననే బాధ, కన్నవాళ్లను మోసం చేశాననే పశ్చాత్తాపం నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయని అంటాడు. తల్లి దండ్రుల మాటల విని నర్మద కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సాగర్ ప్రేమ…
నర్మదకు నచ్చిన గాజులు కొనడానికి వస్తాడు సాగర్. కానీ అవి వేరే వాళ్లు కొనడంతో వాళ్లను గాజులు తనకు కావాలని వాళ్లను బతిమిలాడుతాడు. పెళ్లైన తర్వాత భార్యకు తాను ఇస్తోన్న ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పడంతో వాళ్లు కాదనలేక సాగర్‌కు గాజులు ఇచ్చేస్తారు. సాగర్‌కు తనపై ఉన్న ప్రేమ చూసి నర్మద సంబరపడుతుంది. ఆ గాజులను స్వయంగా నర్మద చేతులకు సాగర్ తొడుగుతాడు.
స్నేహితుల ప్రశ్నలు…
కాలేజీలో శత్రువులుగా ఉన్న ధీరజ్, ప్రేమ పెళ్లి చేసుకోవడం స్నేహితులు షాకవుతారు. మీరు ప్రేమలో పడటం ఏంటి, లేచిపోయి పెళ్లి చేసుకునేంతగా ఎప్పుడు ప్రేమించుకున్నారని ప్రశ్నలు కురిపిస్తారు. ధీరజ్ పేరు చెబితే కంపరంగా ఫీలయ్యే అతడిని ఎలా పెళ్లి చేసుకున్నారని అడుగుతారు. ఇప్పుడు అదే ఫీలింగ్ మనసులో ఉందని ధీరజ్, ప్రేమ అనుకుంటారు. స్నేహితులకు సమాధానం చెప్పకుండా తప్పించుకోబోతారు.
ధీరజ్, ప్రేమ వద్దని చెప్పిన వినకుండా స్నేహితులు పట్టుపట్టి వారిని ఫొటోలు తీస్తారు. ఇద్దరితో రొమాంటిక్ ఫోజులు పెట్టిస్తారు. .ప్రేమ మీద చేయి వేయమని స్నేహితులు అనడంతో తప్పనిసరి వారు చెప్పినట్లు చేస్తాడు సాగర్. ప్రేమ కూడా సాగర్‌పై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ అతడిపై చేయివేస్తుంది.