Best Web Hosting Provider In India 2024
Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరం… కన్నకూతురిపై తండ్రి అసభ్య ప్రవర్తన… పోక్సో కేసు నమోదు
Tirupati Crime: తిరుపతి జిల్లాలో ఘోరమైన అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కన్న కూతురుపైన ఓ కీచక తండ్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తల్లికి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ తండ్రి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
Tirupati Crime: తిరుపతిలో కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన తిరుపతి నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామ్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి నగరంలోని ఒక నగర్‌లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ అశోక్ (45) దంపతులకు ఇద్దరు కుమారులు, 16 ఏళ్ల కుమార్తె ఉంది.
కుమార్తె శ్రీకాళహస్తిలోని ఒక ప్రభుత్వ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో కుమార్తెపై తండ్రి కన్నేశాడు. బాలిక నిద్రిస్తున్న సమయంలో ఆమె పట్ల తండ్రి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికకు చెప్పాడు. బాలిక అప్పటికే తన తల్లికి చెప్పింది. అయితే అప్పుడు ఆమె పూర్తిగా విషయం చెప్పలేదు. సెలవులు ముగిసిన తరువాత తిరిగి హాస్టల్‌కు తీసుకెళ్లి దింపు సమయంలో కూడా ఎవరికీ చెప్పొద్దంటూ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అయితే అప్పటికే తల్లికి జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో ఆమె ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. అయితే హాస్టల్‌లో ఉన్న కుమార్తె ఫోన్ చేసి తల్లిని రమ్మని చెప్పింది.
దీంతో తల్లి ఏం జరిగిందో తెలుసుకోవడానికి శ్రీకాళహస్తిలో హాస్టల్లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లింది. జరిగిన విషయాన్ని పూర్తిగా తల్లికి చెప్పింది. దీంతో తల్లి కుమిలిపోయింది. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భర్తపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష
పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి జైలు శిక్ష పడింది. తూర్పగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు డి.గోపాలకృష్ణమూర్తి దాఖలైన పోక్సో కేసులో నేరం రుజువు అయింది. దీంతో ఆ ఉపాధ్యాయుడికి రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందని ఉండ్రాజవరం ఎస్ఐ గుబ్బల శ్రీనివాసరావు తెలిపారు.
2020 ఫిబ్రవరి 28న ఉపాధ్యాయుడు గోపాలకృష్ణమూర్తిపై అప్పటి ఎస్ఐ అవినాష్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం సాక్షులను విచారించిన విచారణ అధికారి పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసును కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా డీవీ రామాంజనేయలు వాదించారు. సాక్ష్యాధారాలను బట్టి, నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి ఈనెల 21న తీర్పును వెలువరించినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్