Best Web Hosting Provider In India 2024
Perfume Side Effects: పర్ఫ్యూమ్ డైలీ వాడుతున్నారా.. ? ఈ భాగాల్లో స్ప్రే చేసుకుంటే ప్రమాదమని తెలుసా!
Perfume Side Effects: మనలో చాలా మందికి పెర్ఫ్యూమ్ రెగ్యూలర్‌గా వాడితే దుష్ప్రభావాలు కలుగుతాయని తెలియకపోవచ్చు. వాటి నుంచి వెలువడే సువాసన నుంచి తీవ్రమైన తలనొప్పి, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అందరికీ కాకపోయినా పదిమందిలో ఒకరికి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పర్ఫ్యూమ్ వాడకం ఇప్పటి కాలంలో తప్పనిసరి అయిపోయింది. పర్ఫ్యూమ్ నుంచి వచ్చే సువాసనకు బాగా అలవాటు పడిపోయారు. ఉదయం ఆఫీసుకు వెళ్లి, సాయంత్రం ఇంటికి చేరుకునేంత వరకూ అదే ఫీలింగ్, అదే ఫ్రెష్ నెస్ ఉండాలనేది ప్రతి ఒక్కరి తాపత్రయం. అందుకే పలు బ్రాండ్లు రీసెర్చ్ చేసి మరీ వాడుతుంటాం. ఇంకొందరైతే హ్యాండ్ బ్యాగ్‌లలో పెట్టుకుని పర్ఫ్యూమ్ ఎఫెక్ట్ తగ్గిందని అనిపించినప్పుడల్లా స్ప్రే చేసుకుంటూ ఉంటారు.
చెమట వాసన నుండి ఉపశమనం పొందడానికి, తాజాగా అనిపించుకోవడానికి పెర్ఫ్యూమ్ వాడాలని అంతా ఫిక్సయిపోయారు. కానీ, మీ శరీరానికి సువాసనను జతచేసి, మనసుకు ఉల్లాసాన్ని కలిగించే పెర్ఫ్యూమ్ కొన్నిసార్లు మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పు కలిగిస్తుందని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్ఫ్యూమ్ను తయారు చేయడానికి, దాని సువాసనను ఎక్కువ కాలం నిలిపి ఉంచడానికి పలు కంపెనీలు అనేక రకాల రసాయనాలను ఉపయోగిస్తారట. ఈ రసాయనాలను వాడటం వల్ల చాలా మందిలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
పర్ఫ్యూమ్ వాడకం వల్ల కలిగే ప్రమాదం
పర్ఫ్యూమ్లో ఉపయోగించే రసాయనాల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని ఫలితంగా చర్మంపై అలెర్జీలు రావడం సాధారణమని తెలుస్తోంది. పర్ఫ్యూమ్ తయారీలో ఈ రసాయనాలను వాడటం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు, వంధ్యత్వం, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందట. కొంతమందిలో పర్ఫ్యూమ్ అలెర్జీకి కూడా కారణమవుతుంది. అలాంటి వారికి పర్ఫ్యూమ్ వాసన వల్ల అలర్జీ తీవ్రత కాస్త పెరిగి వాపు, తీవ్రమైన తలనొప్పి, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట. హార్వర్డ్ హెల్త్ అధ్యయనం ప్రకారం, పది మందిలో ఒకరికి పర్ఫ్యూమ్లో ఉండే రసాయనాల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో ఎక్కడెక్కడ పర్ఫ్యూమ్ వాడకూడదంటే..
- చంకల కింద పర్ఫ్యూమ్ వాడకూడదు. అలా చేస్తే చర్మం దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
- ప్రైవేట్ భాగాల దగ్గర కూడా పర్ఫ్యూమ్ వాడకూడదు. అలా చేస్తే చర్మం దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
- గాయాలు లేదా పుండ్ల దగ్గర కూడా పర్ఫ్యూమ్ వాడకూడదు. దీని వల్ల దురద, నొప్పి వస్తుంది.
- మీ చర్మం సున్నితంగా ఉంటే కూడా, మీరు పొట్ట, నాభి చుట్టూ కూడా పర్ఫ్యూమ్ వాడకూడదు. అలా చేస్తే చర్మంపై దురద వస్తుంది.
- నోరు, ముక్కు దగ్గర పర్ఫ్యూమ్ వాడకూడదు. అలా చేస్తే హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి నష్టం కలిగిస్తాయి.
- ముఖం, మెడ మీద పర్ఫ్యూమ్ వాడితే స్కిన్ ఇన్ఫెక్షన్లు బయటకు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఈ భాగాలు సెన్సిటివ్ గా ఉంటాయి. కాబట్టి రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది.
- జుట్టుపై పర్ఫ్యూమ్ వాడకూడదు. ఇలా వాడటం వల్ల ఆల్కహాల్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ జుట్టును పొడిగా మారుస్తాయి.
ఈ ప్రమాదాల తీవ్రత కలగకుండా ఉండేందుకు ఏం చేయాలి?
కాస్త దూరం నుంచి స్ప్రే చేయండి: పర్ఫ్యూమ్ బాటిల్‌ను ఒక ఆరు అంగుళాల దూరంలో ఉంచి స్ప్రే చేసుకోండి. లేదంటే ఒక క్లాత్ పై స్ప్రే చేసి అద్దుకోవడం వల్ల ఇరిటేషన్ ఫీలింగ్ కలగదు.
పల్స్ పాయింట్స్: చర్మంపై పర్ఫ్యూమ్ అప్లై చేసుకోవాలనుకుంటే మణికట్టుపై, చెవుల వెనుక, మోచేతికి లోపలి వైపు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల హీట్ రిలీజ్ అయి సువాసనను సహజంగా వెదజల్లుతుంది.
ముందు పరీక్షించుకోండి:
కొత్త పర్ఫ్యూమ్ వాడే ముందు టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి. ప్రత్యేకించి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇలా చేసుకోవాలి.
సంబంధిత కథనం