Best Web Hosting Provider In India 2024
FIITJEE centers : పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా ఫిట్ జీ సెంటర్లు బంద్! విద్యార్థుల్లో ఆందోళన..
FIITJEE centers closed : భారతదేశం అంతటా ఫిట్ జీ కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నాయి! ఎగ్జామ్ సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితి కారణంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
దేశవ్యాప్తంగా పలు ఫిట్ జీ (ఫోరం ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) కోచింగ్ సెంటర్లు అకస్మాత్తుగా మూతపడ్డాయి. సరిగ్గా బోర్డు- ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంతో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. టీచర్ల కొరత ఇందుకు కారణం అని తెలుస్తోంది.
ఫిట్ జీ సెంటర్స్ మూసివేత- అసలేం జరిగింది..?
వారం రోజుల వ్యవధిలో.. దిల్లీ, మీరట్, ఘజియాబాద్, లక్నో, వారణాసి, భోపాల్, పట్నా, నోయిడాలోని ప్రైవేట్ ఫిట్ జీ కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. దీనికి తోడు పుణెలోని రెండు ఫిట్ జీ కేంద్రాలు కూడా క్లోజ్ అవ్వడంతో 300 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, రాజ్ నగర్ జిల్లా కేంద్రాల్లోని ఒక కేంద్రాన్ని కూడా మూసివేయడంతో 800 మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.
అయితే, జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయులు క్విట్ చేయడం కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నట్టు తెలుస్తోంది.
నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఫిట్ జీని విడిచిపెట్టినట్టు పట్నా కేంద్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు హెచ్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను నాలుగేళ్లుగా అక్కడ బోధిస్తున్నానని, అయితే 2024 జులై నుంచి జీతాలు రాకపోవడంతో గత ఏడాది నవంబర్‌లో పట్నా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయానని ఓ టీచర్ తెలిపారు.
అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం తరగతులు నిర్వహించలేకపోతున్నామని, అధ్యాపకులకు మెరుగైన ఆఫర్లు రావడంతో ఇతర కోచింగ్ సెంటర్లకు వెళ్లిపోయరని మీరట్ కేంద్రానికి చెందిన ఒక సిబ్బంది హెచ్టీకి వివరించారు. పరిస్థితిని ఫిట్ జీ దిల్లీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని, వారు 500 మంది విద్యార్థులకు బోధించడానికి తగినంత ఫ్యాకల్టీని అందిస్తే తరగతులను పునఃప్రారంభిస్తామని సిబ్బంది తెలిపారు.
ఫిట్ జీ ఎలాంటి కోచింగ్ ఇస్తుంది?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లేదా వివిధ సైన్స్ ఒలింపియాడ్లలో ప్రవేశానికి సిద్ధమవుతున్న 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఫిట్ జీ కోచింగ్ అందిస్తుంది. ఈ కోచింగ్ సెంటర్స్‌కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
“ఐదేళ్లకు 100 శాతం ఫీజు చెల్లించాము”
కాగా ఫిట్ జీ సెంటర్లు మూతపడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిట్ జీపై కేసు వేసేందుకు సిద్ధపడుతున్నారు.
“ఫిట్ జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వచ్చాము. 5 సంవత్సరాలకు 100% ఫీజు చెల్లించాం. అందులో 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మా పిల్లలను ఆకాశ్ ఇన్స్టిట్యూట్కు తరలించాలని సోమవారం ఫిట్ జీ నుంచి సందేశం వచ్చింది. మా బిడ్డకు ఎక్కడ నేర్పించాలో నిర్ణయిస్తాం. ఆ విషయం ఫిట్ జీ చెప్పాల్సిన అవసరం లేదు,” అని ఓ విద్యార్థి తండ్రి రాజీవ్ కుమార్ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link