TTA New President : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది

Best Web Hosting Provider In India 2024

TTA New President : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది

Maheshwaram Mahendra HT Telugu Jan 24, 2025 02:56 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 24, 2025 02:56 PM IST

TTA New President Naveen Reddy : తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరికొందరు సభ్యులుగా ప్రమాణం చేశారు. అధ్యక్షుడితో పాటు బోర్డు సభ్యులకు అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు అందుతున్నాయి.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది బాధ్యతలు స్వీకరించారు. 2025 – 2026 సంవత్సరాల పదవీకాలానికి కొత్తగా ఎన్నికైన బోర్డ్‌ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

yearly horoscope entry point

కొత్త బోర్డు సభ్యులు వీరే…

బోర్డ్‌ సభ్యులుగా డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి, కవితా రెడ్డి, సహోదర్‌ పెద్దిరెడ్డి, డా. దివాకర్‌ జంధ్యం, శివారెడ్డి కొల్ల, మనోహర్‌ బొడ్కె, ప్రదీప్‌ మెట్టు, సురేశ్‌ రెడ్డి వెంకన్నగరి ఉన్నారు.

వీరే కాకుండా నిశాంత్‌ సిరికొండ, అమిత్‌ రెడ్డి సురకంటి, గణేశ్‌ మాధవ్‌ వీరమనేని, స్వాతి చెన్నూరి, ఉషారెడ్డి మన్నం, సంతోష్‌ గంటారం, నరసింహ పెరుక, కార్తిక్‌ నిమ్మల, శ్రీకాంత్‌ రెడ్డి గాలి, అభిలాష్‌ రెడ్డి ముదిరెడ్డి, మయూర్‌ బండారు, రంజిత్‌ క్యాతం, అరుణ్‌ రెడ్డి అర్కల, రఘునందన్‌ రెడ్డి అలుగుబెల్లి, దిలీప్‌ వాస, ప్రదీప్‌ బొద్దు, ప్రభాకర్‌ మదుపాటి, నరేంద్ర దేవరపల్లి, ప్రవీణ్‌ సామల, ప్రవీణ్‌ చింట, నరేశ్‌ బైనగరి, వెంకట్‌ అన్నపరెడ్డి కొత్తగా బోర్డ్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా కొత్త బోర్డు సభ్యులకు టీటీఏ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పైళ్ళ మల్లారెడ్డి, సలహా మండలి చైర్మన్‌ డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి, కో-ఛైర్మన్‌ డాక్టర్‌ మోహన్‌ రెడ్డి పాటలోల్ల, సభ్యుడు భరత్‌ రెడ్డి మాదాది, అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, మాజీ అధ్యక్షుడు వంశీ రెడ్డి కంచరకుంట్ల శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ నవీన్ రెడ్డితో పాటు బోర్డు స‌భ్యుల‌కు స్వ‌దేశం, స్వ‌రాష్ట్రం నుంచి అభినంద‌న‌లు, శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. 

నవీన్ రెడ్డి ఉద్యోగిగా అమెరికాలో అడుగుపెట్టారు. కన్సల్టింగ్ కంపెనీలు, మీడియా, రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లతో పాటు అనేక ఇతర సంస్థ‌ల‌ను స్థాపించి ఎన్నో విజ‌యాలు అందుకున్నారు. నవీన్ రెడ్డి తెలుగు వారికి ఎంతో గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తున్నారంటూ ప‌లువురు కొనియాడారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Usa News TeluguNri News Usa TeluguTelangana NewsHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024