Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2 January 29th Episode: తండ్రిపై ఆగ్రహించిన దశరథ్.. జ్యోత్స్న అబద్ధాలు.. శౌర్యను చూసి తల్లిడిల్లిన దీప
Karthika Deepam 2 Today Episode January 29: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో.. తండ్రి శివన్నారాయణను దశరథ్ నిలదీస్తాడు. కాంచనను అవమానించినందుకు బాధపడతాడు. జ్యోత్స్న అబద్ధం చెబుతుంది. ఆసుపత్రిలో ఉన్న శౌర్య దగ్గరికి దీప వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జనవరి 29) ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. ఆసుపత్రిలో ఉన్న శౌర్యను చూడాలంటూ ఏడుస్తూ రోడ్డుపై పరుగెడుతూ వెళుతుంది దీప. కార్తీక్ ఆమె వెనుక పరుగెడతాడు. నేను శౌర్యను చూడాలి కార్తీక్ బాబు అని అంటుంది. దీంతో ఆరోగ్య సమస్య ఉందని శౌర్యకు కూడా తెలియదు కార్తీక్ చెబుతాడు. ఏడుస్తూ ఉంటే అనుమానం వస్తుందని అంటాడు. ఆపరేషన్ గురించి శౌర్యకు తెలియదని, ఇలా ఏడిస్తే తనకు అనుమానం వస్తుందని అంటాడు.
నా మీద ఒట్టే..
శౌర్య ముందు ఏడ్వనని మాట ఇవ్వాలని దీపను కార్తీక్ అడుగుతాడు. అది నా వల్ల అవుతుందా అని దీప అంటుంది. శౌర్యను చూసి ఏడ్చావంటే నా మీద ఒట్టే అని తలపై చేయి పెట్టుకుంటాడు కార్తీక్. ఇప్పటికే ప్రాణం లేని శవంలా నటిస్తున్నాను, ఇంకా మీ మాటలతో నిల్చున్న చోట సమాధి కట్టకండి అని ఏడుస్తుంది దీప. మాటిస్తేనే శౌర్య దగ్గరికి తీసుకెళతానని కార్తీక్ అంటాడు. మన కన్నీళ్లు ఆపుకోవాల్సిందే అంటాడు. దీంతో శౌర్య ముందు కన్నీళ్లు కనిపించకుండా దాస్తానని దీప మాట ఇస్తుంది. శౌర్య పూర్తిగా కోలుకునే వారకి తనకు ఏం జరిగింతో తెలియకూడదని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ఆటోలో ఆసుపత్రికి బయలుదేరతారు.
బాధపెట్టడం మంచిది కాదు
కాంచన మాటలను తలచుకొని ఆలోచిస్తుంటాడు శివన్నారాయణ. ఇంతలో దశరథ్, సుమిత్ర అక్కడికి వస్తారు. కార్తీక్, దీప మీద కోపం ఉన్నా.. కాంచన తన రక్తం పంచుకొని పుట్టిన చెల్లి అని తండ్రి శివన్నారాయణతో దశరథ్ అంటారు. శౌర్య ఆరోగ్యం కోసం సాయం అడిగేందుకు వచ్చిన కాంచనకు సాయం చేయాల్సిందని చెబుతాడు. ఈ మాట నువ్వు అడుగుతున్నావా.. నీ వెనుక ఉన్న వాళ్లు అడిగిస్తున్నారా అని సుమిత్రను ఉద్దేశించి శివన్నారాయణ అంటాడు. “కాంచన మీ కూతురు.. ఆ మనిషిని బాధపెట్టడం మనకు అంత మంచిది కాదు” అని కాంచన అంటుంది.
చెల్లి బాధ అర్థం చేసుకోవా.. దశరథ్ ఆగ్రహం
దీప మాట ఎత్తగానే వెళ్లిపోయారని, దీంతో వాళ్ల ఉద్దేశం వేరని అర్థమైందని శివన్నారాయణ అంటాడు. దీంతో దశరథ్కు కోపం వస్తుంది. “ఇదే మాట ఎన్నిసార్లు చెబుతావ్ నాన్న. ఇంక చెల్లి బాధ అర్థం చేసుకోవా. ఆస్తులు కాదనుకొని పోయిన మనిషి.. అప్పు కోసం గుమ్మం తొక్కందంటే ఎంత మనసు చంపుకొని ఉంటుందో ఆలోచించలేవా” అని దశరథ్ ఆగ్రహిస్తాడు. దశరథా అని శివన్నారాయణ ఆపేందుకు ప్రయత్నిస్తాడు. కోపంతో కాదు బాధతో అడుగుతున్నానని దశరథ్ అంటాడు. ఇంతలో జ్యోత్స్న వస్తుంది.
అబద్ధాలు చెప్పిన జ్యోత్స్న
దీప కూతురికి ఆరోగ్యం బాగోలేదని నిజం తెలిస్తే సాయం చేసేందుకు వెళతారని, అందరూ కలిసిపోయినా ఆశ్చర్యం లేదని, అలా జరగకూడదని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కథ నచ్చినట్టు చెప్పాలని డిసైడ్ అవుతుంది. శౌర్య గురించే కదా కాంచన డబ్బు అడిగింది అని శివన్నారాయణతో దశరథ్ అంటాడు. దీంతో అబద్ధం చెబుతుంది జ్యోత్స్న. అవసరం లేదు డాడీ అని జ్యోత్స్న అంటుంది. శౌర్య ఆసుపత్రిలో లేదు.. ఎవరో బావ ఫ్రెండ్ ఇంట్లో ఉందంట అంటూ అబద్దం ఆడుతుంది. ఇదంతా దీప ఆడిస్తున్న నాటకం అని, కావాలంటే కాల్ చేసి మాట్లాడాలని అంటుంది.
ఆస్తి గురించి అడిగింది
సుమిత్ర ఈ విషయం నమ్మదు. దీప అలా చేయదని అంటుంది. శివన్నారాయణ కూడా మనవరాలు జ్యోత్స్న చెప్పిన విషయాన్నే నమ్ముతాడు. “మమ్మీ ఎప్పుడూ ఇంతే తాత. సొంత కూతురి కంటే దీపే ఎక్కువ” అని అంటాడు. దీప ఇంటికి ఎందుకు వెళ్లావని దశరథ్ అంటాడు. నిజం తెలుసుకునేందుకు అని జ్యోత్స్న అంటుంది. దీప ఇంట్లో తాపీగా పిండి కలుపుకుంటూ ఉందని చెబుతుంది. శౌర్య విషయంలో ఎందుకు అబద్ధం చెప్పి, డబ్బు కోసం బావ, అత్తను మా ఇంటికి పంపానని అడిగానంటుంది.
“ఏ ఆస్తి మీద నా అత్తకు, బావకు హక్కులేదా అని నా ముఖం మీదే తలుపు వేసింది” అని దీప గురించి జ్యోత్స్న నిలువునా అబద్ధాలు అడుతుంది. దీలా చేయదని సుమిత్ర అంటుంది. ఫోన్ చేసి కనుక్కో అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న చెప్పిన మాటలన్నీ శివన్నారాయణ నమ్మేస్తాడు. దశరథ్ను సుమిత్ర రెచ్చగొడుతుందనేలా నానా మాటల అంటుంది పారిజాతం. దీంతో ఇక చాలు పిన్ని అని గట్టిగా అరుస్తాడు దశరథ్. మంచి పని చేశావని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఇద్దరూ రాక్షసానందం పొందుతారు. గేమ్ ఇప్పుడే స్టార్ట్ చేశానని జ్యోత్స్న అంటే.. దీప జీవితం ఆడు నీకు తోడుగా ఉంటానని పారిజాతం అంటుంది. “సారీ దీప.. నిన్ను బ్యాడ్ చేసేందుకు ఇంట్లో అబద్ధం చెప్పా. ఈలోపు నువ్వు కూతురి కోసం గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉండు” అని జ్యోత్స్న అనుకుంటుంది.
సాయం చేసేందుకు శ్రీధర్ నో
నగలు తాకట్టు పెట్టి శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని శ్రీధర్‌తో కావేరి అంటుంది. అందరి జీవితాలు సర్వనాశనం అవుతున్నాయంటూ వెటకారంగా సంతోషిస్తాడు శ్రీధర్. సాయం చేసేందుకు కార్తీక్ అడగలేదు కదా అంటాడు. వారికి డబ్బు ఇవ్వొద్దని కావేరికి తెగేసి చెబుతాడు. వాళ్లు ఇంటికి వచ్చి అడగకపోతే సాయం చేయొద్దని అంటాడు.
శౌర్య దగ్గరికి దీప
తల్లిదండ్రులతో తాను ఉన్న ఫొటోను పట్టుకొని ఆసుపత్రి బెడ్‌పై బాధపుడుతుంటుంది శౌర్య. అమ్మను చూడాలనిపిస్తుందని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్, దీప ఆసుపత్రికి వస్తారు. శౌర్య దగ్గరికి వెళుతుండగా దీపను కార్తీక్ అపుతాడు. ఏడ్వనని మాట ఇచ్చావని అంటాడు. ముందు తాను వెళ్లి పిలిచినప్పుడు నవ్వుతూ రా అంటాడు. ఆ తర్వాత శౌర్య దగ్గరికి వెళ్లి సర్ప్రైజ్ తెచ్చానని కార్తీక్ అంటాడు. దీంతో దీపను చూపిస్తాడు.
తల్లడిల్లిన దీప
దీపను చూడగానే అమ్మ అని ఆనందిస్తుంది శౌర్య. వేగంగా వెళ్లి శౌర్యను కౌగిలించుకుంటుంది దీప. శౌర్యకు కనిపించకుండా కన్నీరు పెట్టుకుంటుంది. కార్తీక్‌కు ఇచ్చిన మాట మేరకు తాను ఏడుస్తున్నట్టు శౌర్యకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది. కన్నీరు పెట్టుకుంటూ తల్లడిల్లుతుంది. దీప, కార్తీక్‌ను దగ్గరికి తీసుకుంటుంది శౌర్య. నీకు నిజం చెప్పనందకు సారీ అని శౌర్య అంటుంది. సారీ ఎందుకులే అంటుంది దీప. తాను పరీక్షల కోసం ఆసుపత్రిలో ఉన్నానని శౌర్య చెబుతుంది. వారం రోజులు నిన్ను చూడకుండా ఉండలేనని, అందుకే ఈ ఫొటో తెచ్చుకున్నానని అంటుంది. ఒంటరిగా పడుకోవడం భయం కదా.. ఎలా ఉంటున్నావని శౌర్యను దీప అడుగుతుంది. కాశీ మావయ్య వస్తాడు కదా, కథలు చెప్పేవాడు అని శౌర్య బదులిస్తుంది. దీంతో నాకు తప్ప శౌర్య గురించి అందరికీ తెలుసన్న మాట అని దీప అంటుంది. నీకు తెలియడానికి నాకు ఏమైంది అని శౌర్య అడుగుతుంది. నీకేం కాలేదమ్మా, బలం తగ్గింది కదా అదే చెబుతోందని అని కార్తీక్ కవర్ చేస్తాడు. ఏడుస్తూనే అంతే అని దీప అంటుంది.
నేను పాస్ అవుతానా..
నీ కూతురు చచ్చిపోతుందని జ్యోత్స్న అన్న మాటలను తలుచొని ఏడుస్తుంది దీప. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని, నాకేం కాలేదుగా శౌర్య అడుగుతుంది. నీకేం కాదు, కార్తీక్ బాబు.. నువ్వు అబద్దం చెప్పారుగా అందుకే ఏడుపు వస్తోందని దీప అంటుంది. డాక్టర్ వస్తున్నారని నర్సు చెప్పడంతో ఐసీయూ నుంచి దీప, కార్తీక్ బయటికి వెళ్లేందుకు రెడీ అవుతారు. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందని శౌర్య అంటుంది. ఇప్పటి వరకు అన్ని పరీక్షలు పాస్ అయ్యానని, ఇంకో పెద్ద పరీక్ష ఉందంట, అది పాస్ అవుతానా అని శౌర్య అడుగుతుంది. దేవుడు పాస్ చేస్తాడా అని శౌర్య అంటుంది. దీప ఏడుస్తూనే ఉంటుంది. పాస్ అవుతావని కార్తీక్ అంటాడు. మనం ముగ్గురు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉంటామా అని శౌర్య అంటుంది. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం రౌడీ, దేవుడు కూడా విడదీయలేడు అని కార్తీక్ అంటాడు.
బోరున విలపించిన దీప
రూమ్ నుంచి బయటికి వచ్చాక వెక్కివెక్కి ఏడుస్తుంది దీప. మాట ఇచ్చింది నిలబెట్టుకునేందుకే కదా అని కార్తీక్ అంటాడు. నా వల్ల కావడం లేదు అని దీప చెబుతుంది. శౌర్యకు ఏం కాదని కార్తీక్ అంటాడు. ఈ మాట నాకు కాదు.. శౌర్యకు చెబితే నమ్ముతుందని, దానికి నిజం తెలియదు కదా అని బాధతో దీప అంటుంది. శౌర్య మాటలు వింటుంటూ.. తనని చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదని అంటుంది. “నా కూతురు చావుతో పోరాడుతోంది. అది బతకదన్న మాటే కత్తితో పడిచినట్టు గుర్తొస్తూనే ఉంది” అని దీప అంటుంది.
జ్యోత్స్న చెప్పింది
అసలు శౌర్య గురించి నీకు ఎవరు చెప్పారని దీపను కార్తీక్ అడుగుతాడు. తనకు జ్యోత్స్న చెప్పిందని దీప అంటుంది. తను వచ్చి చెప్పే వరకు తనకు నిజం తెలియలేదని చెబుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని జ్యోత్స్న ఏమీ అనవద్దని అంటుంది. జ్యోత్స్న మంచి పనే చేసిందని, లేకపోతే ఇప్పటికీ అబద్ధంలోనే బతికేదాన్ని అని దీప అంటుంది. నీపై ప్రేమతోనే నిజం దాచానని, కోపంతో కాదు దీప అని కార్తీక్ చెబుతాడు. “ఇప్పుడు నేను శౌర్య వద్ద నిజం దాస్తున్నా. అంటే.. నేను శౌర్యను మోసం చేస్తున్నాట్టా. కాదు కదా” అని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 29) ఎపిసోడ్ ముగిసింది.
సంబంధిత కథనం