Best Web Hosting Provider In India 2024
Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఫ్యామిలీకి అవమానం -గుడిలో భద్రావతి రచ్చ – ధీరజ్‌ను కొట్టిన విశ్వ
Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు జనవరి 29 ఎపిసోడ్‌లో ఊరి పెద్దగా అమ్మవారికి హారతి ఇవ్వమని రామరాజును పూజారి కోరుతాడ. హారతి ఇచ్చే అర్హత రామరాజుకు లేదని భద్రావతి వాదిస్తుంది. పిల్లలకు లేపుకెళ్లి పెళ్లి చేయడం నువ్వే నేర్పించావా అంటూ రామరాజును అవమానిస్తుంది.
ప్రభల పోటీలు మొదలవుతాయి. రామరాజు, సేనాపతి కుటుంబాలు మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. ప్రభల పోటీల్లోనే ధీరజ్‌ను చంపాలని విశ్వ మనుషులు ప్లాన్ చేస్తారు. ధీరజ్‌ను సీక్రెట్‌గా రౌడీ ఫాలో అవుతాడు. ప్రభల రథాన్ని పట్టుకున్న ధీరజ్‌ను పొడవబోతాడు. కానీ అప్పుడే రాయి తట్టుకొని రౌడీ కిందపడటంతో ధీరజ్ ప్రాణాలతో బయటపడతాడు. మంచి ఛాన్స్ మిస్ చేయడంతో రౌడీపై విశ్వ ఫైర్ అవుతాడు.
పోటీలో గెలిచిన రామరాజు ఫ్యామిలీ…
ప్రభల పోటీల్లో సేనాపతి, రామరాజు ముందు ఉండటంతో భద్రావతి ఆనందపడుతుంది. కానీ చివరి నిమిషంలో వారిని దాటేసి రామరాజు కుటుంబం పోటీల్లో గెలుస్తుంది. పోటీలో గెలిచిన అనందంతో రామరాజు ఫ్యామిలీ గంతులేయడం చూసి సేనాపతి, విశ్వ కోపం పట్టలేకపోతారు. ధీరజ్ చావును, శవాన్ని కళ్లారా చూడాలని అనుకున్నానని, కానీ మాపై వాడి గెలుపును చూస్తానని అనుకోలేదని ధీరజ్ మనసులో కోపంతో రగిలిపోతాడు.
ఓటమి బాధలో విశ్వ…
ఓటమి బాధలో ఉన్న విశ్వ దగ్గరకు ధీరజ్ వస్తాడు. పోటీలో గెలవాలంటే కండలు ఒక్కటే పెంచితే సరిపోదు. గుండెల్లో బలం ఉండాలని విశ్వతో అంటాడు ధీరజ్. నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను నీకు చెప్పకపోతే బాగుండదు కదా…హ్యాపీ సంక్రాంతి బావమరిది అంటూ ధీరజ్‌కు వెటకారంగా విషెస్ చెబుతాడు ధీరజ్. నీ ఏడుపు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని అంటాడు. విశ్వతో సెల్ఫీ తీసుకొని బై…రా బామ్మర్ది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ధీరజ్ మాటలతో విశ్వ కోపం పట్టలేకపోతాడు.
రౌడీలకు క్లాస్…
కోపంగా రౌడీల దగ్గరకు వచ్చి క్లాస్ పీకుతాడు విశ్వ. పిస్తాలు, వస్తాదులు, టార్గెట్ చేస్తే మిస్సవ్వడం జరగదని, ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడినైనా క్షణాల్లో లేపేస్తామని బిల్డప్‌లు ఇచ్చారు…కానీ ఓ పిల్ల బచ్చాను చంపలేకపోయారని రౌడీలను నిలదీస్తాడు విశ్వ. మీ వల్ల కాదంటే నేనే రంగంలోకి దిగుతానని అంటాడు. ధీరజ్‌ను ఏదో శక్తి కాపాడుతుందని, రెండు సార్లు మిస్సైన మూడో సారి మాత్రం వాడిని ఎవరు కాపాడలేరని రౌడీలు చెబుతారు. ఈ సారి మీరు మిస్ చేస్తే మిమ్మల్ని లేపేయడానికి మరో గ్యాంగ్‌ను పిలిపిస్తానని రౌడీలకు విశ్వ వార్నింగ్ ఇస్తాడు.
ప్రేమ కన్నీళ్లు…
తన కారణంగా కుటుంబం పడుతోన్న బాధ చూసి ప్రేమ ఎమోషనల్ అవుతుంది. నేను వాళ్లతో లేను అనే దుఃఖం మా వాళ్ల కళ్లల్లో కనిపిస్తోందని ధీరజ్‌తో ప్రేమ అంటుంది. మా వాళ్లు కళ్లెదుట ఉన్నా వాళ్లను చేరుకోలేనంత దూరంగా తాను ఉన్నానని, అందరూ ఉండి కూడా అనాథనయ్యానని కన్నీళ్లు పెట్టుకుంటుంది. పండుగ సంబరాల్లో తాను, తన కుటుంబం తప్ప అందరూ సంతోషంగా ఉన్నారని, అందుకు నువ్వు నా మెడలో కట్టిన తాళి అని ధీరజ్‌తో అంటుంది ప్రేమ. ఈ బాధకు కారణం నువ్వేనని ప్రేమకు బదులిస్తాడు ధీరజ్.
మాటలతో హింసించకు…
నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మా నాన్న నాతో మాట్లాడటం లేదని, నాకు అసలు చిన్న కొడుకు లేడని అన్నాడని బాధపడతాడు. ఆ రోజు నువ్వు అలా ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదని ధీరజ్ అంటాడే. పదే పదే అది గుర్తుచేసి చంపకు, నన్ను మాటలతో హింసించకుండా దయచేసి వదిలేయమని ధీరజ్‌ను ప్రాధేయపడుతుంది.
ధీరజ్ కోపం…
పూజలు, హారతుల్లో పాల్గొనేంత సంతోషంగా తాను లేనని ప్రేమ అంటుంది. నువ్వు రాకపోతే నేను వెళ్లనని ధీరజ్ అంటాడు. నేను ఒక్కడినే వెళితే నీ గురించి అడుగుతారు…వాళ్లకు ఏమని సమాధానం చెప్పాలని కోపంగా ధీరజ్ అంటాడు. నేను ఎంత చెప్పిన నువ్వు రావు…నేనే మనశ్శాంతి కోసం ఎక్కడికైనా వెళ్లిపోతానని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ధీరజ్. తన కారణంగా రామరాజు కుటుంబం బాధపడకూడదని మనసు చంపుకొని పూజలో కూర్చోవాలని ప్రేమ అనుకుంటుంది.
అర్హత ఉండాలి….
ఊరి పెద్దగా అమ్మవారికి హారతి మీరే ఇవ్వాలని రామరాజును పూజారి కోరుతాడు. రామరాజు హారతి ఇవ్వడానికి వీలులేదని భద్రావతి అడ్డుపడుతుంది. హారతి ఇచ్చే వ్యక్తికి అర్హత ఉండాలి అని అంటుంది. రామరాజుకు ఏ అర్హత ఉందని పూజారిని ప్రశ్నిస్తుంది. ఊళ్లో రామరాజు గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తి అని పూజారి అంటాడు. జీవితంలో కష్టపడిపైకి వచ్చారని, పదిమందికి ఆదర్శప్రాయుడు అని పూజరి అంటాడు.
లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు…
తిండిపెట్టి ఆశ్రయం ఇచ్చిన ఇచ్చిన ఇంటి అమ్మాయికి మాయ మాటలు చెప్పి లేపుకుపోయి పెళ్లి చేసుకోవడం ఆదర్శమా…రోడ్డుపై బికారీల తిరుగుతున్నాడని జాలి పడి ఆశ్రయం ఇస్తే వెన్నుపోటు పొడవటం ఆదర్శమా అని గొడవకు దిగుతుంది భద్రావతి. పాతికేళ్ల క్రితం గొడవను మనసులో పెట్టుకొని రామరాజువ్యక్తిత్వాన్ని కించపరచడం కరెక్ట్ కాదని ఊరి పెద్దలు అంటారు.
రామరాజు వార్నింగ్…
పాతికేళ్ల క్రితమే కాదు ఇప్పటికి వీళ్ల కుటుంబం అలాగే తగలడింది అని వెటకారంగా మాట్లాడుతుంది భద్రావతి. ఆడదానివనే సంస్కారంతో ఆగిపోతున్నానని, మాట జారితే బాగుండదని భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు రామరాజు నా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దని హెచ్చరిస్తాడు. మర్యాద లేకుండా మాట్లాడి నీ గౌరవానికి భంగం తెచ్చుకోవద్దని అంటాడు.
లేపుకెళ్లి పెళ్లి….
అయినా భద్రావతి వెనక్కి తగ్గదు. నువ్వు నా చెల్లిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. నీ రెండో కొడుకు నర్మదను, నీ చిన్న కొడుకు ప్రేమను లేపుకొని వెళ్లిపోయిచేసుకున్నారు. ఓ ఇంటి ఆడపిల్లను లేపుకెళ్లి పెళ్లిచేసుకోవడం నీ కొడుకులకు నువ్వే నేర్పించావని రామరాజును అవమానిస్తూ మాట్లాడుతాడు సేనాపతి.
కన్నపిల్లలకు సంబంధాలు…
కన్నపిల్లలకు సంబంధాలు చూసి పెళ్లి చేయడం చేతకాని వాడివి సమాజంలో గౌరవం గల వ్యక్తివి ఎలా అవుతావని రామరాజును నిలదీస్తుంది భద్రావతి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని, మాట జారితే బాగుండదనిభద్రావతికి చందు వార్నింగ్ ఇస్తాడు. ముందు నీకు మీ నాన్నను పెళ్లి చేయమనమను…పెద్ద కొడుకు అయినా నిన్ను వదిలేసి నీ కంటే చిన్నవాళ్లు పెళ్లి చేసుకున్నప్పుడే నీ తండ్రి అసమర్థత, చేతకానీ తనం బయటపడిందని భద్రావతి అంటుంది. నీ బాబుకు ఇంట్లోనే విలువ లేదు…ఇళ్లో వాళ్లు విలువ ఎందుకు ఇవ్వాలని చందుతో సేనాపతి అంటాడు. ఆపండి అని వేదావతి అరుస్తుంది.
విశ్వకు దొరికిన ధీరజ్…
విశ్వ మనుషులకు ధీరజ్ దొరికిపోతాడు. ధీరజ్‌ను విశ్వ చితక్కొడతాడు. చంపడానికి కత్తి తీస్తాడు. ప్రేమ అడ్డొస్తుంది. ధీరజ్‌ను చంపాలని చూస్తే ముందే తానే చచ్చిపోతానని మెడపై కత్తి పెట్టుకుంటుంది ప్రేమ. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.