Karthika Deepam 2 Serial February 1: ట్రీట్మెంట్ ఆపేస్తానన్న డాక్టర్.. కార్తీక్, దీప కంగారు.. జ్యోత్స్న మాటలకు పారు షాక్

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial February 1: ట్రీట్మెంట్ ఆపేస్తానన్న డాక్టర్.. కార్తీక్, దీప కంగారు.. జ్యోత్స్న మాటలకు పారు షాక్

 

Karthika Deepam Today Episode February 1st: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో… డబ్బు కట్టకపోతే శౌర్యకు వైద్యం ఆపేస్తానని కార్తీక్‍తో డాక్టర్ చెప్పేస్తాడు. దీంతో కార్తీక్, దీప దిక్కుతోచని స్థితిలో పడిపోతారు. దీప నుంచి కాల్ కోసం జ్యోత్స్న ఎదురుచూస్తుంటుంది.

 
Karthika Deepam 2 Serial February 1: ట్రీట్మెంట్ ఆపేస్తానన్న డాక్టర్.. కార్తీక్, దీప కంగారు.. జ్యోత్స్న మాటలకు పారు షాక్
Karthika Deepam 2 Serial February 1: ట్రీట్మెంట్ ఆపేస్తానన్న డాక్టర్.. కార్తీక్, దీప కంగారు.. జ్యోత్స్న మాటలకు పారు షాక్
 

కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ (ఫిబ్రవరి 1)లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఎలా అని బాధగా కూర్చొని ఉంటుంది దీప. ఆపరేషన్‍కు నాలుగు గంటలే ఉందని, డబ్బు తెచ్చారా అని కార్తీక్‍కు అడుగుతుంది. డబ్బులు కట్టారా అని నర్స్ అడిగిందని చెబుతుంది. డబ్బు కట్టేశానని కార్తీక్ అంటాడు. అంత డబ్బు ఎలా వచ్చిందని కార్తీక్‍ను అడుగుతుంది. తాను రూ.4లక్షలే కట్టానని కార్తీక్ చెబుతాడు. కట్టాల్సింది రూ.45లక్షలు కదా అని దీప అడుగుతుంది. ఇంకా రూ.41లక్షలు కట్టాలి కదా అని టెన్షన్ పడుతుంది. మనకు నాలుగు గంటలే మిగిలాయని అంటుంది.

కలెక్టర్ అవుతాను కదా…

శౌర్య ఏడుస్తోందని నర్స్ చెబుతుంది. దీంతో కార్తీక్, దీప వెళతారు. ఇంజక్షన్ వేస్తానని నర్స్ చెప్పిందని, మీరు ఉంటేనే ఇండక్షన్ తీసుకుంటానని అన్నానని శౌర్య చెబుతుంది. ఇంటికి ఎప్పుడు వెళదామని అడుగుతుంది. పెద్ద పరీక్ష అయిపోయాక వెళదామని కార్తీక్ సర్దిచెబుతాడు. స్కూల్‍కు వెళ్లాలని ఉందని శౌర్య అంటుంది. పడుకోవాలని దీప అంటుంది. “పడుకుంటే తాత కలలోకి వస్తున్నాడమ్మా. తాతయ్య దగ్గరికి వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది” అని శౌర్య అంటుంది. దీంతో దీప కన్నీరు పెట్టుకుంటుంది. అమ్మ దగ్గరే ఉంటానని చెబుతుంది.

నేను కలెక్టర్ అవ్వాలని అన్నావ్ కదా.. నేను తాతయ్య దగ్గరికి వెళ్లిపోతే కలెక్ట్ ఎలా అవుతానని శౌర్య చెబుతుంది. నాన్న.. నేను కలెక్టర్ అవుతారా కదా అని కార్తీక్‍ను శౌర్య అడుగుతుంది. అవుతావమ్మా… నీ కలను ఈ నాన్న నిజం చేస్తాడని కార్తీక్ బాధగానే అంటాడు. మనం సంతోషంగా ఉంటాం కదా అని శౌర్య అడుగుతుంది.

ట్రీట్‍మెంట్ ఆపేస్తాం

ఇంతలో కార్తీక్‍ను డాక్టర్ పిలుస్తున్నాడని నర్స్ చెబుతుంది. డబ్బుల కోసమే అయి ఉంటుందని దీప అంటే.. డబ్బులు ఏంటమ్మా అని శౌర్య అడుగుతుంది. ఏమీ లేదని కార్తీక్ అంటాడు. శౌర్యను త్వరగా ఇంటికి పంపాలని డాక్టర్ అంకుల్‍కు చెప్పండి నాన్న అని కార్తీక్‍తో శౌర్య చెబుతుంది.

 

ఆపరేషన్‍కు నాలుగు గంటలే టైమ్ ఉందని, స్పెషలిస్ట్ ఇక్కడికి వచ్చేందుకు దారిలో ఉన్నారని కార్తీక్‍తో డాక్టర్ చెబుతాడు. ఆపరేషన్ కోసం అంతా సిద్ధం చేస్తుంటే.. రూ.4లక్షలే కట్టావంటా అని ప్రశ్నిస్తాడు. డబ్బు కోసం తాను చాలా ట్రై చేస్తున్నానని కార్తీక్ చెబుతాడు. ట్రీట్‍మెంట్ ఆపేస్తే పాపకు ఎంత సీరియస్‍గా ఉందో అర్థం అవుతుందని డాక్టర్ అంటాడు. ఈ ఆపరేషన్‍కు వాడే మెడిసిన్ చాలా ఖరీదైనవని చెబుతాడు. తెలిసిన వ్యక్తి అనే కారణంతో ట్రీట్‍మెంట్ చేస్తున్నామని, దోషిలా నిలబెడుతున్నావని చెబుతాడు. ట్రీట్‍మెంట్ ఆపేయాలని ఇప్పుడే చెబుతానని డాక్టర్ అంటాడు. దీంతో కార్తీక్, దీప కంగారు పడతారు.

డాక్టర్‌ను బతిమాలిన కార్తీక్

ఆసుపత్రిలో ఇప్పటి వరకు కట్టిన మొత్తం ట్రీట్‍మెంట్‍కే సరిపోలేదని, కడతారనే నమ్మకంతోనే ఇప్పటి వరకు వైద్యం కొనసాగించానని డాక్టర్ అంటాడు. డాక్టర్ చేతులు పట్టుకుంటాడు కార్తీక్. ఇవి కాళ్లు అనుకోవాలని, తన కూతురిని బతికించేందుకునేందుకు ఇంకొక్క అవకాశం ఇవ్వాలని బతిమిలాడతాడు. ట్రీట్‍మెంట్ ఆపొద్దని, డబ్బులు కడతానని అంటాడు. ఆపరేషన్‍కు నాలుగు గంటల టైమ్ ఉందని, తానైతే అంతా రెడీ చేస్తానంటాడు. డబ్బు కడితే ఆపరేషన్ చేస్తానని, రెడీ చేసుకోవాలని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు.

 

చేతకానితనం, నిస్సహాయత

డాక్టర్ డబ్బు కావాల్సిందేనని చెప్పడంతో కార్తీక్ కన్నీరు పెట్టుకుంటాడు. ఏంటి కార్తీక్ బాబు ఇది అని దీప అడుగుతుంది. “ఓ తండ్రి చేతకాని తనం. ఓ భర్త నిస్సహాయత. ఒక్క మనిషి ఆవేదన. ఏం చేయాలో అర్థం కావట్లేదు దీప” అని కార్తీక్ బాధగా అంటాడు. నా ప్రాణం తీయడానికి ఈ కష్టం వచ్చిందంటూ చెబుతాడు. 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో శౌర్య కలలు కంటుంటే.. ఎలా బతికించుకోవాలో అర్థం కాకుండా మనం ఉన్నాం అని దీప అంటుంది. ఏ దేవుడైనా కరుణించకపోతాడా.. సాయం చేయకపోతాడా అని ఎదురుచూస్తున్నా కార్తీక్ బాబు అని దీప అంటుంది.

దాసు దగ్గరికి శ్రీధర్, కావేరి

దాసును చూసేందుకు కావేరి వస్తుంది. నాన్నకు అంతా బాగానే ఉంది అత్తయ్య అని కావేరితో కాశీ చెబుతాడు. దాసు లాంటి మంచి మనిషినికి ఇలాంటి పరిస్థితి అని కావేరి బాధపడుతుంది. మీ ఆయన ఎక్కడ అని తన తండ్రి శ్రీధర్ గురించి వెటకారంగా అడుగుతుంది స్వప్న. ఇంతలోనే తలుపుకొట్టిన శబ్ధం వినిపిస్తుంది. స్వప్న తలుపు తీస్తే శ్రీధర్ అంటాడు. కావేరి ఇంట్లో పండ్లు మరిచిపోయిందని, ఇవి ఇచ్చేందుకు వచ్చానని శ్రీధర్ అంటాడు.

 

డెలివరీ బాయ్‍లా బయటే ఉన్నారు.. లోపలికి రండి అని శ్రీధర్‌తో స్వప్న అంటుంది. నేను నీ నాన్ననే అని శ్రీధర్ అంటే.. అందులే లోపలికి రమ్మనున్నానంటూ కౌంట్ వస్తుంది. ఇలా వారిద్దరి మధ్య సూటిపోటి మాటలు సాగుతాయి. ఏదైనా సాయం కావాలంటే అడిగితే చేస్తానని శ్రీధర్ అంటాడు. అడిగితే కానీ చేయవా అని స్వప్న ప్రశ్నిస్తుంది. అడిగితేనే సాయం చేస్తాననేలా శ్రీధర్ అంటాడు. కూతురితో తిట్టుంచుకోవద్దని శ్రీధర్‌తో కావేరి అంటుంది. నోరు అదుపులో పెట్టుకోవాలంటుంది. పెట్టుకోకపోతే ఏం చేస్తాం, ఇంటికి వెళ్లాక నీతో పడలేం కదా అని శ్రీధర్ అంటాడు. దాసుకు యాక్సిడెంట్ అయి ఉంటుందని కావేరి అంటే.. అటూ.. ఇటూ తిరుగుతుంటే ఏదో ఒకటి గుద్దకపోతే ఏం చేస్తుందని శ్రీధర్ అంటాడు. ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. దాసు కాస్త చేయి కదిలించినా ఎవరూ చూడరు.

దేవుడిని వేడుకున్న కాంచన, అనసూయ

శౌర్యను ఎలాగైనా కాపాడాలని, సాయం చేయాలని కాంచన, అనసూయ గుడికి వెళ్లి దేవుడును మొక్కుకుంటారు. శౌర్యకు ఏమీ కాదని, ధైర్యంగా ఉండాలని పూజారి చెబుతాడు. పరిస్థితి చేయి జారిపోయిందని, భయంగా ఉందని కాంచన అంటుంది. ఇష్టదైవానికి హోమం జరిపించడం మంచిదని పూజారి చెబితే.. అలాగే అని కాంచన చెబుతుంది.

 

దశరథ్, సుమిత్రకు నిజం చెప్పిన కాశీ

శౌర్య పరిస్థితి గురించి మీరు విన్నదంతా నిజమే అని దశరథ్, సుమిత్రకు కాశీ చెబుతాడు. శౌర్యలో ఆసుపత్రిలో ఉందని, ఆపరేషన్ చేయకపోతే బతకదని అంటాడు. ఆపరేషన్ చేయించేందుకు రూ.45లక్షలు కావాలని, బావ దగ్గర డబ్బు లేదని చెబుతాడు. శౌర్య దగ్గదని భయంగా ఉందని, అందుకే మీ దగ్గరికి వచ్చానని కాశీ అంటాడు. దీంతో సుమిత్ర కంగారు పడుతుంది.

మామయ్యతో మాట్లాడండి

సాయం చేద్దామని సుమిత్ర అంటుంది. కాల్ చేస్తే వాళ్లు లిఫ్ట్ చేయవచ్చు కదా అని దశరథ్ అంటాడు. సాయం కోసం వస్తే ఛీ అన్నాక మళ్లీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారని సుమిత్ర అంటుంది. దీప నా ప్రాణాలు కాపాడిందని, ఇప్పుడు దాని కూతురిని కాపాడే బాధ్యత నాపై ఉందని సుమిత్ర చెబుతుంది. మామయ్య శివన్నారాయణతో మీరు మాట్లాడండని అని అంటుంది. శౌర్య పరిస్థితిపై తనకు బాధగా ఉందని, కానీ నాన్నకు తెలియకుండా అంత అమౌంట్ ఇవ్వలేమని చెబుతాడు. వాళ్ల గురించి మాట్లాడితేనే నాన్న చిరాకు పడుతున్నాడంటాడు. ఏ సాయం చేయకుండా వదిలేయమంటారు అని సుమిత్ర అంటుంది. తనకు సాయం చేయాలని ఉందని, ముందు నాన్నతో చెబుతానని అంటాడు. శౌర్యకు ఏమైనా అయితే తాను మనశ్శాంతిగా బతకగలనా అని సుమిత్ర అంటుంది. దీపకు కూతురు అంటే ప్రాణం అని, శౌర్యకు ఏమైనా అయితే చచ్చిపోతుందని కన్నీరు పెట్టుకుంటుంది.

 

జ్యో చెప్పిన విషయానికి పారు షాక్

కార్తీక్‍ను వదిలేస్తే శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇస్తానని, తనకు ఫోన్ చేయాలని దీపతో జ్యోత్స్న చెప్పి ఉంటుంది. దీంతో దీప నుంచి కాల్ వస్తుందా అని టెన్షన్‍గా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది జ్యోత్స్న. వేరే కాల్స్ వస్తుంటే చిరాకు పడుతుంటుంది. 12 గంటలు ఎవరు కాల్ చేయవద్దని అంటుంది. ఇంతలో పారిజాతం అక్కడికి వస్తుంది. ఎంకంత విసుక్కుంటున్నావని పారు అంటుంది. దీప కాల్ కోసం తాను వేచిచూస్తున్నానని జ్యోత్స్న చెబుతుంది. అవసరాన్ని అవకాశంగా చేసుకుంటున్నానని అంటుంది.

దీప కూతురు ఆసుపత్రిలో ఉందని పారిజాతంకు నిజం చెబుతుంది జ్యోత్స్న. అబద్ధం అన్నావ్ కదా అని పారు అడిగితే.. ఈ ఇంటి నుంచి సాయం అందకూడదని అబద్ధం చెప్పానని జ్యో అంటుంది. దీప కూతురు చావు బతుకుల్లో ఉందని, ఆపరేషన్ చేయకపోతే శౌర్య బతకదని చెప్పేస్తుంది. దీంతో పారిజాతం షాక్ అవుతుంది. తాను రాత్రి ఆసుపత్రికి వెళ్లానని జ్యోత్స్న అంటే.. నాకు ఎందుకు చెప్పలేదని పారిజాతం ప్రశ్నిస్తుంది. “దీప కూతురు ప్రాణాలు కాపాడేందుకు మెడలో మంగళసూత్రానికి ఖరీదు కట్టానంటూ నువ్వు ఊరుకుంటావా” అని అసలు విషయం చెబుతుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావే అని ఆశ్చర్యంగా పారు అడుగుతుంది. దీప కూతురికి ఆపరేషన్ చేయాలంటే రూ.50లక్షలు కావాలని, లేకపోతే అది బతకదని అంటుంది. డబ్బు ఇస్తా, నా బావను నాకు ఇచ్చేయ్ అని దీపను అడిగానని జ్యోత్స్న చెప్పేస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 1) ఎపిసోడ్ ముగిసింది.

 

 

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024