Best Web Hosting Provider In India 2024
Pushpa 2 OTT Streaming: పుష్ప 2 స్ట్రీమింగ్.. నేషనలే కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్‍లో ట్రెండింగ్.. 21 దేశాల్లో..
Pushpa 2 OTT Streaming: పుష్ప 2 సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. భారీ కలెక్షన్లతో రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍లో గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
పుష్ప 2: ది రూల్ సినిమా భారీ బ్లాక్‍బస్టర్ కొట్టి అనేక రికార్డులను తిరగరాసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం మొదటి నుంచి సత్తాచాటి.. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సహా చాలా రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఇప్పుడు ఓటీటీలో పుష్ప 2 సినిమా హవా చూపిస్తోంది. గ్లోబల్ రేంజ్‍లో సత్తాచాటుతోంది.
గ్లోబల్ రేంజ్‍లో ట్రెండింగ్
పుష్ప 2 సినిమా నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ టాప్-10లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 1) నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో ఏడో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. ఇండియా ట్రెండింగ్‍లో టాప్-1లో పుష్ప 2 సత్తాచాటుతోంది.
జనవరి 30వ తేదీన పుష్ప 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అదనపు ఫుటేజ్ ఉన్న రీలోలెడెడ్ వెర్షన్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. భారీ వ్యూస్ సాధిస్తూ ఇంటర్నేషనల్ రేంజ్‍లో దుమ్మురేపుతోంది.
21 దేశాల్లో టాప్-10
పుష్ప 2 చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల్లో నెట్‍ఫ్లిక్స్ సినిమాల టాప్-10లో ట్రెండ్ అవుతోంది. ఇండియాతో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‍ల్లో ప్రస్తుతం టాప్‍లో ఉంది. మొత్తంగా 21 దేశాల్లో టాప్-10లో ట్రెండ్ అవుతోంది. అంతలా ఇంటర్నేషనల్ రేంజ్‍లో అదరగొడుతోంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అని ఈ మూవీలో డైలాగ్ ఉన్నట్టే గ్లోబల్ రేంజ్‍లో ఓటీటీలో ఈ చిత్రం దుమ్మురేపుతోంది.
పుష్ప 2 నెట్‍ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ ఓ స్పెషల్ యాడ్ కూడా చేశారు. భారీ క్రేజ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సుమారు రూ.275కోట్ల రికార్డు స్థాయి మొత్తానికి దక్కించుకుందని తెలుస్తోంది. ఆ రేంజ్‍లో ఈ చిత్రం వ్యూస్‍లో సత్తాచాటుతోంది.
పుష్ప 2 చిత్రాన్ని సుకుమార్.. గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్‌తో ఏర్పడిన అంచనాలను అందుకొని మెప్పించారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి దుమ్మురేపేశారు. యాక్షన్, స్వాగ్‍తో అదరగొట్టారు. దీంతో ఆరంభం నుంచే ఈ చిత్రం దుమ్మురేపింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్లను సాధించింది. మిగిలిన మూడు భాషల్లోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది.
పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లీ పాత్రలో హీరోయిన్‍గా నటించారు రష్మిక మందన్నా. మరోసారి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ నెగెటివ్ రోల్ చేశారు. జగపతి బాబు, రావు రమేశ్, జగదీశ్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో పాటలకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍లో ఎక్కువగా భాగం సామ్ సీఎస్ ఇచ్చారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్, రవిశంకర్ ప్రొడ్యూజ్ చేశారు.
పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1850కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసిందని అంచనా. దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ చిత్రంగా నిలిచింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు దక్కించుకుంది. బాలీవుడ్‍లో ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.
సంబంధిత కథనం