TG Local Body Elections : పల్లెల్లో సమరానికి సై.. రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు?

Best Web Hosting Provider In India 2024

TG Local Body Elections : పల్లెల్లో సమరానికి సై.. రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు?

Basani Shiva Kumar HT Telugu Feb 01, 2025 10:40 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Feb 01, 2025 10:40 AM IST

TG Local Body Elections : పంచాయతీ ఎన్నికల నగారా ఏ క్షణంలోనైనా మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఓటర్ల జాబితా మొదలు.. బ్యాలెట్‌ బాక్స్‌లను రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మరో కొత్త విషయం తెలిసింది. రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది.

పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికలు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

పంచాయతీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 3 విడతల్లో నిర్వహిస్తే సిబ్బంది కొరత ఉండదని అధికారులు చెబుతుండగా.. అలా చేస్తే సమయం వృథా అవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇతర శాఖల సిబ్బందిని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరిగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

yearly horoscope entry point

అధికారుల ఏర్పాట్లు..

పంచాయతీ ఎన్నికల నగారా ఎప్పుడైనా మోగించవచ్చన్న సంకేతాలతో.. అధికారులు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటరు జాబితాను గ్రామాలు, వార్డుల వారీగా సిద్ధం చేశారు. ఒక వైపు కొత్త ఓటర్ల పేర్లను వార్డుల వారీగా నమోదు చేస్తుండగా.. మరోవైపు ఓటరు బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు కసరత్తు ప్రారంభించారు.

బ్యాలెట్ పేపర్ల సరఫరా..

బ్యాలెట్ పత్రాల ముద్రణకు అందుకు కావాల్సిన పేపర్లను అధికారులు సరఫరా చేస్తుండగా.. దానిపై గుర్తులు మాత్రం ప్రైవేటు ప్రింటింగ్‌ ప్రెస్‌లలో ముద్రించాలని భావిస్తున్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు నలుగురు, అయిదుగురు, పది మంది ఉన్నట్లు.. ఇలా గుర్తులతో ముందస్తుగానే ముద్రించుకొని సిద్ధంగా ఉంచాలా లేక అభ్యుర్థులు బరిలో ఉన్నట్లు తేలాక ముద్రించాలా అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.

సన్నద్ధంగా ఉండండి..

పంచాయతీ ఎన్నికలకు అన్నివిధాల సన్నద్ధంగా ఉండాలని.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ తాజాగా అధికారులను ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ సీఈవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. పురపాలికల్లో విలీనమైన గ్రామ పంచాయతీలను ఎన్నికల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. అక్కడి వారిని జీపీ ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. కొత్త ఏర్పాటైన మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను గుర్తించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు.

వేడెక్కిన రాజకీయం..

తాజా పరిణామాలతో.. పంచాయతీ ఎన్నికలకు ఈనెలలోనే నగారా మోగవచ్చనే టాక్ నడుస్తోంది. అటు పొలిటికల్ పార్టీలు కూడా స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీలైనన్ని ఎక్కువ పంచాయతీలు గెలిచి పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. అటు మున్సిపాలిటీల్లోనూ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. వీటికి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

Whats_app_banner

టాపిక్

Ts Local Body ElectionsTs PoliticsTrending TelanganaTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024