Best Web Hosting Provider In India 2024
Rashmika Mandanna On Wheelchair: వీల్ చైర్‌లో రష్మిక మందన్నా- తీసుకొచ్చిన హీరో- అందులో దైవత్వం ఉందంటూ కామెంట్స్
Rashmika Mandanna Chhaava Promotions On Wheelchair And Comments: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వీల్ చైర్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీల్ చైర్‌లో ఉంటూనే హిందీ ఫిల్మ్ ఛావా ప్రమోషన్స్ చేస్తోన్న రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Rashmika Mandanna Chhaava Promotions On Wheelchair: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక మందన్నా చేసిన న్యూ హిందీ ఫిల్మ్ ఛావా.
వాలంటైన్స్ డే సందర్భంగా
అలాగే, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సికందర్ అనే మరో మూవీ చేస్తోంది. అయితే, ఈ సికందర్ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక మందన్నాకు గాయాలు అయ్యాయి. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు రష్మికకు దెబ్బ తగిలింది. దాంతో వీల్ చైర్‌కే పరిమితం అయింది రష్మిక మందన్నా. మరోవైపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఛావా సినిమా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
పీరియాడిక్ అడ్వెంచర్ థ్రిల్లర్
రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్న వీల్ చైర్‌లో వచ్చి ఛావా ప్రమోషన్స్ చేస్తోంది రష్మిక మందన్నా. పీరియాడిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఛావా సినిమాలో కత్రీనా కైఫ్ భర్త, బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా చేస్తున్నాడు. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జోడీ కట్టిన ఛావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు.
రష్మికను తీసుకొచ్చిన విక్కీ కౌశల్
దినేష్ విజన్ నిర్మాతగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్ కానున్న ఛావా మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో స్టేజీపైకి రష్మిక మందన్నాను వీల్ చైర్‌లో హీరో విక్కీ కౌశల్ తీసుకురావడం అందరిని అట్రాక్ట్ చేసింది.
ప్రతీసారి ఏడ్చేస్తాను
తర్వాత ఈ ఈవెంట్‌లో రష్మిక మందన్నా మాట్లాడుతూ.. “ఛావా చిత్రంలో మాటలకు అందని భావం ఉంటుంది. ఇందులో ఓ దైవత్వం ఉంటుంది.. అంతులేని ప్రేమ ఉంటుంది.. అందుకే ఈ చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ మూవీని చూసిన ప్రతీ సారి నేను ఏడ్చేస్తాను. అంత అద్భుతంగా ఉంటుంది” అని చెప్పింది.
మ్యాజిక్ జరుగుతుంది
“ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, జానే తూ అనే పాట అందరినీ మెస్మరైజ్ చేస్తుంటుంది. విక్కీ కౌశల్ చుట్టూ అద్భుతమైన ఆరా ఉంటుంది. ఆయన పక్కన నిలబడితేనే ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఛావా పాత్రకు విక్కీ అద్భుతంగా సెట్ అయ్యారు. అందుకే లక్ష్మణ్ సర్ విక్కీని ఈ పాత్రకు తీసుకున్నారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది” అని రష్మిక మందన్నా తెలిపింది.
ఛావా నటీనటులు
ఇదిలా ఉంటే, ఛావా సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నాతోపాటు అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్, నీల్ భూపాలం, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
సంబంధిత కథనం