Madha Gaja Raja Collections: త‌మిళంలో కోట్లు – తెలుగులో ల‌క్ష‌లు – టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద విశాల్ మ‌ధ‌గ‌జ‌రాజాకు దెబ్బ

Best Web Hosting Provider In India 2024

Madha Gaja Raja Collections: త‌మిళంలో కోట్లు – తెలుగులో ల‌క్ష‌లు – టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద విశాల్ మ‌ధ‌గ‌జ‌రాజాకు దెబ్బ

Nelki Naresh Kumar HT Telugu
Feb 01, 2025 07:30 PM IST

Madha Gaja Raja: విశాల్ మ‌ధగ‌జ రాజా తెలుగు వెర్ష‌న్‌ తొలిరోజే బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డింది. త‌మిళంలో యాభై కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ తెలుగులో తొలిరోజు ఇర‌వై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది. తెలుగులో రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది.

మ‌ధగ‌జ రాజా క‌లెక్ష‌న్స్
మ‌ధగ‌జ రాజా క‌లెక్ష‌న్స్

ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ విన్న‌ర్‌గా విశాల్ మ‌ధ గ‌జ రాజా మూవీ నిలిచింది. 2013 షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 12 ఏళ్ల త‌ర్వాత రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

yearly horoscope entry point

యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రిచింది. యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీలో అంజ‌లి, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్లుగా న‌టించారు. సంతానం, సోనూసూద్‌, కీల‌క పాత్ర‌లు పోషించారు.

న‌ల‌భై ల‌క్ష‌లు…

ఈ శుక్ర‌వారం (జన‌వ‌రి 31న‌) సేమ్ టైటిల్‌తో మ‌ధగ‌జ రాజా తెలుగులో రిలీజైంది.త‌మిళంలో కాసుల వ‌ర్షం కురిపించిన ఈ యాక్ష‌న్ కామెడీ మూవీకి తెలుగులో తొలిరోజే దెబ్బ ప‌డింది. శుక్ర‌వారం రోజు ఈ మూవీ తెలుగులో న‌ల‌భై ల‌క్ష‌ల వ‌ర‌కు గ్రాస్‌, ఇర‌వై ల‌క్ష‌ల లోపే షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం.

రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో ఈ మూవీ రిలీజైంది. తొలిరోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చూస్తుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావ‌డం అనుమానంగానే క‌నిపిస్తోంది. శ‌ని, ఆదివారాలు క‌లెక్ష‌న్స్ పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.త‌మిళంలో మొద‌టిరోజు ఈ మూవీ ఏకంగా మూడు కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

2013లో షూటింగ్ కంప్లీట్‌…

మ‌ధ‌గ‌జ రాజా మూవీకి సుంద‌ర్. సి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2013లో ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల కార‌ణంగా రిలీజ్ వాయిదాప‌డింది. విశాల్ చొర‌వ‌తో అడ్డంకుల‌ను దాటుకొని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప‌దిహేను కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 51 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది.

మ‌ధ‌గ‌జ రాజా క‌థ ఇదే…

రాజు అలియాస్ మ‌ధ‌గ‌జ‌రాజా (విశాల్‌) కేబుల్ ఆప‌రేట‌ర్‌. మాధ‌వి (అంజ‌లి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తండ్రి కార‌ణంగా అత‌డి ప్రేమ‌కు బ్రేక‌ప్ ప‌డుతుంది. స్కూల్ మాస్ట‌ర్ కూతురి పెళ్లికి వెళ‌తాడు రాజా. ఆ పెళ్లిలో త‌న బాల్య స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నార‌నే నిజం రాజాకు తెలుస్తుంది.

వారి కోసం మీడియా టైకూన్ కాక‌ర్ల విశ్వ‌నాథ్‌తో (సోనూ సూద్‌) పోరాటానికి రాజా సిద్ధ‌ప‌డ‌తాడు? త‌న తెలివితేట‌ల‌తో విశ్వ‌నాథ్‌ను రాజా ఎలా బోల్తా కొట్టించాడు? పెళ్లిలో రాజాకు ప‌రిచ‌య‌మైన మాయ (వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌) ఎవ‌రు? రాజా ప్లాన్స్ వ‌ల్ల‌ మినిస్ట‌ర్ స‌త్తిపండు ఎలా బ‌ల‌య్యాడు అన్న‌దే మ‌ధ‌గ‌జ రాజా మూవీ క‌థ‌.

విజ‌య్ ఆంటోనీ మ్యూజిక్‌…

మ‌ధగ‌జ రాజా మూవీకి హీరో విజ‌య్ ఆంటోనీ క‌థ‌ను అందించాడు. మ‌ధ‌గ‌జ రాజా స‌క్సెస్ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ సుంద‌ర్‌. సితో విశాల్ మ‌రో మూవీ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త మూవీ ఆరాణ్మ‌ణై 4 ఏకంగా వంద కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024