Best Web Hosting Provider In India 2024
Dil Raju: కాంబినేషన్స్‌ను నమ్ముకొని దెబ్బతిన్నాం – బడ్జెట్ కాదు కథలే ముఖ్యం – దిల్‌రాజు కామెంట్స్
Dil Raju: బడ్జెట్ కాదు కథలే ఇంపార్టెంట్ అని సంక్రాంతికి వస్తున్నాం విజయం నిరూపించిందని నిర్మాత దిల్‌రాజు అన్నాడు. నిర్మాతగా ఈ విజయం తనకు విలువైన పాఠాలు నేర్పిందని శనివారం జరిగిన సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ దిల్ రాజు చెప్పాడు.
Dil Raju: కాంబినేషన్స్‌ను నమ్ముకొని గత నాలుగైదు ఏళ్ళుగా నిర్మాతగా తాను తడబడుతున్నానని నిర్మాత దిల్ రాజు అన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తనకు విలువైన పాఠాలు నేర్పిందని చెప్పాడు. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
సూపర్ హిట్ పోస్టర్స్…
ఈ వేడుకలో దిల్‌రాజు మాట్లాడుతూ “సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని చెప్పుకునే పరిస్థితి నెలకొంది. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతున్నాయి. కల్చర్ మారిపోయింది. సినీ పరిశ్రమలో తొంభై శాతం ఫెయిల్యూర్స్ ఉంటాయి . జస్ట్ పది శాతం మాత్రమే సక్సెస్ ఉన్న ఇండస్ట్రీ ఇది. మా డిస్ట్రిబ్యూటర్స్ సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నింటిని తట్టుకుని మాతో జర్నీని కొనసాగిస్తోన్నారు” అని దిల్‌రాజు చెప్పారు.
కథలే ముఖ్యం…
“బడ్జెట్ కాదు కథలే ఇంపార్టెంట్ అని సంక్రాంతికి వస్తున్నాం విజయం నిరూపించిందని దిల్ రాజు అన్నాడు. మేము కూడా గతంలో కథలని నమ్ముకునే సినిమాను నిర్మించాం. కానీ గత నాలుగైదుళ్లుగా కాంబినేషన్స్‌ను నమ్ముకొని దెబ్బతింటున్నాం. మళ్ళీ మాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ రూటు చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో ఒక రహదారి వేసి ఇచ్చాడు. మా సంస్థ నుంచి మరిన్ని అద్భుతమైన సినిమాలు రావడానికి ఈ విజయం ఎనర్జీని ఇచ్చింది” అని అన్నారు.
ఫ్రెండ్లీ హీరో…
“సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ నిర్మాతగా కూడా చాలా పాఠాలు నేర్పించింది.ఎక్కడో పడిపోతున్న మమ్మల్ని పైకి తీసుకొచ్చి నిలబెట్టాడు. మళ్ళీ అద్భుతమైన సినిమాలు తీస్తాం. రిజల్ట్స్ 100% వస్తాయి. వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో. ఆయన నిర్మాతలకు ఇచ్చే గౌరవం మాములుగా ఉండదు. అందుకే ఆయనతో నాలుగు సినిమాలు చేయగలిగానని” దిల్‌రాజు పేర్కొన్నారు.
వంద కోట్ల షేర్…
అనిల్ రావిపూడి మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం తన కెరీర్‌లో ఒక మిరాకిల్ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నాడు. ఈ బ్లాక్‌బస్టర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తె లిపాడు. “ఈ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ వెంకటేష్‌కు దక్కుతుంది.ఈ సినిమా ద్వారా నేనెప్పుడూ వినలేను, చూడలేనేమో అనుకునే రెండు జరిగాయి.ఆరు రోజుల్లో 100 కోట్లు షేర్ కొట్టింది. రీజనల్ ఫిలిం కి చూడలేనేమో అనుకున్న 300 గ్రాస్ నెంబర్ చూడబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చేయబోయే సినిమాల విషయంలో డైరెక్టర్‌గా నా బాధ్యత మరింత పెరిగింది” అని చెప్పాడు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ మూవీ 18 రోజుల్లో 252 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.